బిజినెస్

స్థిరాస్తి వ్యాపారంలో అగ్రగామిగా లోథాగ్రూప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 23: బీజేపీ సీనియర్ నేత మంగళ్ ప్రభాత్ లోధా నేతృత్వంలో ముంబయి నగరంలో నిర్వహిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ‘లోథాగ్రూప్’ దేశంలోకెల్లా అత్యంత సంపన్న రియల్ ఎస్టేట్ సంస్థగా ఆవిర్భవించింది. ఈమేరకు హరుణ్ రిపోర్ట్ అండ్ గ్రోహ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో వెల్లడైంది. 62 సంవత్సరాల కాలంగా లోథా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ముంబయిలో నడుస్తుండగా మొత్తం రూ.27,150 కోట్ల సంపదను ఆర్జించింది. గత యేడాది 18,610 కోట్ల సంపదతో రెండో స్థానంలో ఉన్న ఈ సంస్థ ఆసక్తికరంగా ప్రథమ స్థానానికి ఎగబాకింది. గత యేడాది డీఎల్‌ఎఫ్‌కు చెందిన కుశాల్ పాల్ సింగ్ 23,460 కోట్ల సంపదతో ప్రథమ స్థానంలో నిలవగా ఈ యేడాది ఆ సంస్థ కనీసం తొలి పది స్థానాల్లో సైతం చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. కాగా ఈ యేడాది రెండో స్థానాన్ని జితేంద్ర విర్వానీ ఎంబసీ గ్రూప్ 23,160 కోట్ల సంపదతో ఆక్రమించింది. అలాగే డీఎల్‌ఎఫ్‌కు చెందిన రాజీవ్ సింగ్ 17,690 కోట్ల సంపదతో మూడవ స్థానంలో నిలిచారు. హిరానందనీ బ్రదర్స్, అదే గ్రూప్‌కు చెందిన నిరంజన్, హౌస్ అఫ్ హీరానందనీ ఫీచర్‌కు చెందిన సురేంద్ర 7,800 కోట్ల సంపదతో ఆరో స్థానంలో నిలిచారు. అలాగే మిలియనీర్లైన సోదరులు మనోజ్ మెంద్రా, రాజ్ మెంద్రాలు 5,900 కోట్ల సంపదతో 9వ స్థానంలో నిలిచినట్లు సర్వేలో తేలింది. కాగా దేశంలోని తొలి వంద స్థానాల్లో నిలిచిన రియల్ ఎస్టేట్ సంస్థల మొత్తం ఆస్తుల విలువ 2,36,610 కోట్ల రూపాయలని తేలింది. ఇది గడచిన యేడాదికంటే 27 శాతం అధికమని సర్వే నివేదిక పేర్కొంది.

హర్యానా పరిశ్రమలపై గ్రీన్ ట్రిబ్యునల్ నిఘా
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: హర్యానా రాష్ట్రంలోని సోనీపట్, పానీపట్ జిల్లాల్లో అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలపై గ్రీన్ ట్రిబ్యునల్ నిఘా పెట్టింది. సరైన అనుమతి లేకుండా లేదా నిబంధనలకు వ్యతిరేకంగా ఉత్పత్తులను కొనసాగిస్తున్న పరిశ్రమలను తనిఖీ చేయాలని నేషనల్ ట్రిబ్యునల్ ఇప్పటికే ఆదేశించింది. ఈ పరిశ్రమల వల్ల జల వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని ఎన్‌జీటీ పేర్కొంది. ఈ మేరకు ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్‌తో కూడిన బెంచి ఆదేశాలు కూడా జారీ చేసింది. అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలను తనిఖీ చేయాలని, కాలుష్య నివారణకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయాలని తీర్మానించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, హర్యానా కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా అధికారులు ఉమ్మడిగా ఈ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే రెండు వారాల్లోగా ఉమ్మడి కమిటీ సమావేశమై ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈ కమిటీ వచ్చే మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని, ఈ నివేదికను ఇమెయిల్ ద్వారా పంపాలని స్పష్టం చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది. అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమల వల్ల జల కాలుష్యం పెరిగిందని, అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ శైలేష్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్‌జీటీ విచారించి పై ఆదేశాలను జారీ చేసింది. ఇలాంటి కంపెనీల వల్ల పెరుగుతున్న కాలుష్యంపై ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాలుష్య పరిశ్రమలపై ఉక్కుపాదం మోపాలని ట్రిబ్యునల్ తీర్మానించింది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటున్నది.