బిజినెస్

నాలుగోరోజూ మార్కెట్లలో ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు గురువారం భారీగా లాభపడ్డాయి. రూపాయి విలువలో భారీ ర్యాలీ వచ్చిన తరుణంలో నవంబర్ నెల డెరివేటివ్‌ల సిరీస్ కాలపరిమితి ముగియడంతో మదుపరులు షార్ట్ కవరింగ్‌కు పూనుకోవడం వల్ల బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం 450 పాయింట్లు పుంజుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ తిరిగి కీలకమయిన 10,800 పాయింట్ల స్థాయికి ఎగువన ముగిసింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ నుంచి వచ్చిన సానుకూల వ్యాఖ్యల తరువాత ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. సెనె్సక్స్ గురువారం క్రితం ముగింపుతో పోలిస్తే 453.46 పాయింట్లు (1.27 శాతం) పుంజుకొని, 36,170.41 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 129.85 పాయింట్లు (1.21 శాతం) పెరిగి, 10,858.70 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎగుమతిదారులు గణనీయంగా డాలర్ల విక్రయానికి పూనుకోవడంతో పాటు ముడి చమురు ధరల తగ్గుదల వల్ల గురువారం ఇంట్రా-డేలో అమెరికన్ కరెన్సీతో రూపాయి మారకం విలువ 74 పైసలు పుంజుకొని, 70 స్థాయిని అధిగమించడంతో పాటు మూడు నెలల గరిష్ట స్థాయి 69.88 వద్దకు చేరింది. ‘బ్రెంట్ ముడి చమురు ధర చాలా దిగువ స్థాయికి చేరుకోవడంతో పాటు రూపాయి భారీగా బలపడటం వల్ల ఈక్విటీ మార్కెట్‌లో లావాదేవీలు చాలా ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగాయి. బ్రాడర్ మార్కెట్లు బాగా పుంజుకున్నాయి’ అని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ పరిశోధనా విభాగం అధిపతి జోసెఫ్ థామస్ పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీ రేట్లు తటస్థ స్థాయికి కాస్త దిగువన కొనసాగుతున్నాయని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్లలో కొత్త జీవితానికి ఊపిరి పోసిందని ఆయన అన్నారు. ‘ఫెడరల్ రిజర్వ్ బహుశా కఠిన వైఖరికి ముగింపు పలికేందుకు సమీపంలో ఉన్నట్టు వెలువడిన సంకేతాలుగా ఈ ప్రకటనను చూడవచ్చు. సరయిన స్థాయిలకు చేరుకోవడానికి ఫెడ్ రిజర్వ్‌కు ఇంకా చాలా దూరం ఉంది అని గత ఎఫ్‌ఓఎంసీ సమావేశాల సందర్భంగా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ చేసిన ప్రకటనకు ఈ తాజా ప్రకటన చాలా భిన్నంగా ఉంది’ అని థామస్ పేర్కొన్నారు. ఈ వారాంతంలో జరిగే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం తరువాత ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు ఏ మేరకయినా తగ్గితే, ప్రపంచ స్టాక్ మార్కెట్లు మరింత ఉత్తేజితం అవడానికి దోహదపడుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. గురువారం నాటి లావాదేవీలలో బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, వేదాంత, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్ ప్రధానంగా లాభపడ్డాయి. వీటి షేర్ల ధర అయిదు శాతం వరకు పెరిగింది. మరోవైపు, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్, యెస్ బ్యాంక్, సన్ ఫార్మా షేర్ల విలువ 1.33 శాతం వరకు పడిపోయింది.