బిజినెస్

జీడీపీ రేటు సవరణ సరైనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో భారత తలసరి ఆదాయ అభివృద్ధి (జీడీపీ) రేటును సవరించిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం సమర్థించుకున్నారు. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్‌ఓ) ఈ సవరించిన సంఖ్యను విడుదల చేసిన సంగతి తెలిసిందే. చీఫ్ స్టాటిస్టీషియన్ ప్రవీణ్‌శ్రీవాత్సవ వార్షిక వివరాలను వెల్లడించిన సందర్భంగా ఇలా సవరించిన ఆదాయ వివరాలను వెల్లడించారని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌తో కలిసి జైట్లీ ప్రకటించారు. ఈ సవరించిన ఆదాయ వివరాలు హాస్యాస్పదంగా, కావాలని కోతలు పెట్టిన అంకెలుగా ఉన్నాయంటూ, నీతి ఆయోగ్‌ను సైతం రద్దు చేయాల్సిన అలసరం నెలకొందని కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం బుధవారం ట్విట్టర్‌లో విమర్శించారు. దీనిపై స్పందించిన జైట్లీ మాట్లాడుతూ అసలు చిదంబంరం మాటలే హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తలసరి ఆదాయాభివృద్ధి రేటును సీఎస్‌ఓ ప్రకటించినపుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం స్వాగతించిందని జైట్లీ గుర్తు చేశారు. ఐతే అదే కొలమానంగా ఈ ఆదాయ రేట్లను సవరించిన మీదట తగ్గించి చూపితే అదే నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో సార్వత్రిక ఎన్నికలకు నెలల ముందునుంచే తలసరి ఆదాయాభివృద్ధి కుంటుపడిందని ఆయన తెలిపారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలు తర్వాత వరసగా మూడేళ్లపాటు తలసరి భారత ఆదాయాభివృద్ధి రెండంకెలకు చేరుకున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలకు నెలల ముందు తొలిసారిగా ఒక శాతం తగ్గిందని ఆయన తెలిపారు. తొలుత ప్రామాణికంగా తీసుకున్న 2004-05 నుంచి కాకుండా ఇప్పుడు 2011-12 సంవత్సరం నుంచి సీఎస్‌ఓ లెక్కించి చేసిన పొరబాటును సవరించిందని ఆయన చెప్పారు. ఈమేరకు 2010-11 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ అభివృద్ధి రేటును గతంలో నిర్ధారించిన 10.3 శాతం కాకుండా 8.5 శాతంగా నిర్థారించిందని జైట్లీ, నీతి ఆయోగ్ చైర్మన్ స్పష్టం చేశారు. ఈక్రమంలోనే 2005-06లో గతంలో పేర్కొన్న 9.3 శాతం 7.9 వాతానికి 2006-07లో 8.1 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గిందన్నారు. 2007-08 ఆర్థిక సంవత్సరం రేటుకూడా 9.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ఇందులో డేటాను మార్చే విషయంలో నీతి ఆయోగ్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పషం చేశారు.