బిజినెస్

లాభాలతో ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో ఈవారం లావాదేవీలు అత్యంత సానుకూల ధోరణులను ప్రదర్శించాయి. ఫలితంగా సెనె్సక్స్ గత రెండు వారాల గరిష్టంతో ముగిసింది. ఈవారం ఆరంభం నుంచి లాభాల బాటలో నడిచిన సెనె్సక్స్, లావాదేవీలకు చివరి రోజైన శనివారం స్వల్పంగా 23.89 పాయింట్లు (0.07 శాతం) పెరిగి, 36,194.30 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించడంతోపాటు, అర్జెంటీనాలో ప్రారంభమైన జీ-20 సదస్సుపై దృష్టి సారించడం కూడా స్టాక్ మార్కెట్‌కు కలిసొచ్చింది. ఈ వారం మొత్తంమీద సెనె్సక్స్ 1,213.28 పాయింట్లు (2.34 శాతం) పెరగడం గమనార్హం. సెనె్సక్స్‌తోపాటు జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ) లావాదేవీలు కూడా ఆశాజనకంగానే కొనసాగాయి. శుక్రవారం నిఫ్టీ 18.05 పాయింట్లు (0.17 శాతం) పెరిగి, 10,878.75 పాయింట్ల ముద్ద ముగిసింది. ఈవారం ఎన్‌ఎస్‌ఈ లావాదేవీలను పరిశీలిస్తే నిఫ్టీ 350 పాయింట్లు (3.32 శాతం) పెరిగింది. ఎస్ బ్యాంక్, విప్రో, కోటక్ బ్యాంక్, మహీంద్ర అండ్ మహీంద్ర, సన్ ఫార్మా, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఆటో, హెచ్‌యూఎల్ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. ఈ టాప్ గెయినర్స్ కంపెనీలు సగటున 6 శాతం వరకూ లాభాలను సంపాదించుకున్నాయి. కాగా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, వేదాంతా, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఎస్‌బీఐ తదితర సంస్థలు నష్టాలను చవిచూసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఈ సంస్థల షేర్ల సగటు పతనం 3 శాతంగా నమోదైంది. రంగాల వారీగా చూస్తే, రియాలిటీ, ఫార్మా, ఐటీ రంగాలు సుమారు రెండు శాతం వరకు లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్ స్టాక్స్ తదితరాలు 0.55 శాతం నష్టపోయాయి.

జీ-20 సదస్సు ప్రభావం
బ్యూనస్‌ఎయిర్స్ (అర్జెంటీనా)లో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల జీ-20 సదస్సు ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. ఈ సదస్సులో తీసుకోబోయే నిర్ణయాలు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయన్న నమ్మకం మదుపరుల్లో కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గడం, రూపాయి విలువ బలపడడం వంటి అంశాలు కూడా స్టాక్ మార్కెట్ లాభాల్లో నడిచేందుకు దోహదపడ్డాయి. ఈక్విటీ మార్కెట్ రెండు నెలల గరిష్టానికి చేరుకుందని, 10 ఏళ్ల బాండ్ సుమారు 7.60 శాతం లాభాన్ని నమోదు చేసిందని సాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ ఆఫీసర్ సునీల్ శర్మ తెలిపారు. డాలర్‌కు రూపాయి మారకపు విలువ పెరిగిందని అన్నారు. డాలర్ రేటు సుమారు 70 రూపాయలుగా ఉండడం మార్కెట్‌కు ఊతమిచ్చిన అంశాల్లో ఒకటని పేర్కొన్నారు. గత నెల 26వ తేదీ నాటికి నెలకొన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు మార్కెట్‌లో సానుకూల ధోరణులు కనిపిస్తున్నాయని అన్నారు. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలో చెప్పుకోదగ్గ మార్పులు కూడా స్టాక్ మార్కెట్ సూచీలు పెరగడానికి మార్గాన్ని కల్పించాయని అన్నారు. ఇలావుంటే, డాలర్‌కు మారకపు విలువ శుక్రవారం 13 పైసలు తగ్గి, 69.78 రూపాయలకు చేరింది. ఇన్‌ట్రా ట్రేడ్ బలహీనంగా కొనసాగింది. మొత్తం మీద ఈ వారం అటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ కూడా బలపడి, వచ్చే వారం లావాదేవీలు మరిన్ని లాభాలను ఆర్జించి పెడతాయన్న నమ్మకాన్ని పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సైతం ఇదే తరహాలో నడవడం రాబోయే మార్కెట్ తీరుతెన్నులపై ఒక అవగాహనకు వీలుకల్పిస్తున్నది.