బిజినెస్

సెనె్సక్స్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) లావాదేవీలు ఈవారం జోరుగా కొనసాగాయి. గత రెండు నెలల కాలానికి గరిష్టంతో శుక్రవారం నాటి ట్రేడింగ్‌ను ముగించింది. దూకుడును కొనసాగించిన సెనెక్స్ 36,194.30 పాయింట్లకు చేరుకోవడం మారుతున్న మార్కెట్ గమనాలకు అద్దం పడుతుంది. వరుస నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ లావాదేవీలు ఈవారం ప్రారంభం నుంచే కోలుకోవడం ప్రారంభమైంది. ర్యాలీ చివరి వరకూ కొనసాగడంతో, లాభాల్లో ముగిసింది. వారం మొత్తంలో జరిగిన లావాదేవీలను స్థూలంగా పరిశీలిస్తే, సెనె్సక్స్ క్రమంగా పెరుగుతునే ఉందనే విషయం స్పష్టమవుతుంది. భారీ నష్టాల నుంచి తేరుకొని, మళ్లీ కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడానికి అవసరమైన జవసత్వాలను ఈవారంలో జరిగిన ట్రేడింగ్ మార్కెట్‌కు అందించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర తగ్గడం, రూపాయి మారకపు విలువ బలపడడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్ మళ్లీ పుంజుకోవడానికి మార్గం సుగమమం చేసింది. అర్జెంటీనాలో జరిగిన రెండు రోజుల జీ-20 సదస్సులో సానుకూల నిర్ణయాలు వెలువడతాయన్న ఉద్దేశంతో మదుపరులు ముందుగానే వాటాల కొనుగోళ్లను పెంచారు. ఈ సదస్సు తీర్మానాల ఫలితం వచ్చే వారం మార్కెట్‌పై ప్రభావం చూపిస్తే, అంచనాలు ఈవారం సెనె్సక్స్‌ను బలోపేతం చేశాయి. దేశీయ పెట్టుబడిదారులు సైతం లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈవారం మార్కెట్‌కు కలిసొచ్చిన అంశాల్లో ఒకటి. ఐదు రాష్ట్రాలకు జరిగే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయన్నది ఎగ్జిట్ పోల్స్ వంటి మాధ్యమాల ద్వారా వచ్చే వారమే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈలోగా మార్కెట్‌లో సానుకూల ధోరణులను అందిపుచ్చుకొని, లాభతరమైన వ్యాపారాన్ని కొనసాగించేందుకు మదుపరులు పోటీపడ్డారు. ఇదే పరిస్థితి వచ్చే వారం కూడా ఉంటుందా అనేది అనుమానంగా మారడంతో, ఈవారం మార్కెట్ లాభపడిందన్న వాదన కూడా ఉంది. మరోవైపు మార్కెట్ బలోపేతానికి వ్యూహత్మకమైన, క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల ద్వారా మూచువల్ ఫండ్స్‌లో ద్రవ్య లబ్ధత పెరిగింది. నష్టాలను ఎదుర్కొంటున్న కారణంగా సుమారు నాలుగు వారాలుగా షేర్లను చాలా మంది మదుపరులు హోల్డ్ చేసి ఉంచారు. మార్కెట్ బలపడడంతో, ఈవారంలో వాటిని దశల వారీగా అమ్మకానికి ఉంచారు. మొత్తం 11 కీలక రంగాలకుగాను ఎనిమిది రంగాలు ఈవారం లాభాలను అందిపుచ్చుకోవడం విశేషం. జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో సైతం ఈవారం ట్రేడింగ్ లాభసాటిగా జరిగింది. నష్టాల నుంచి బయటపడిన నిఫ్టీ శుక్రవారం 10,876.76 పాయింట్ల వద్ద ముగిసింది. వచ్చే వారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని, మరింత బలపడి 10,980 పాయింట్ల వరకూ చేరుకోగలదని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద వరుస నష్టాలకు ఈవారం బ్రేక్‌పడడంతో వచ్చే వారం మార్కెట్ మరింత పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.