బిజినెస్

బుల్ పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 3: రూపాయి మారకపు విలువ బలహీనపడడం, స్థూ ల జాతీయోత్పత్తి నీరసించడం వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ స్టాక్ మార్కెట్ ఈవారం లావాదేవీలను లాభాల్లో ముగించింది. గత ఐదు పని రోజుల్లో పరుగుతూ వస్తున్న సెనె్సక్స్ ఈ వారం మొదటిరోజు, సోమవారం అటుపోట్లను తట్టుకొని నిలబడింది. 46.70 పాయింట్లు మెరుగుపడడంతో, 36,241 పాయింట్లకు చేరింది. నిఫ్టీ సైతం ఏడు పాయింట్లు పెరిగి, 10,883.75 పాయిం ట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మా ర్కెట్ నుంచి తీవ్రమైన ఒత్తిడి కొనసాగడంతో రూపాయి మారకపు విలువ మళ్లీ బలహీనపడింది. సహజంగానే స్టాక్ మార్కెట్‌పై రూపాయి పతన ప్రభావం కనిపించింది. అయితే, వరుసగా ఐదు రోజులు కొనసాగిన ర్యాలీకి బ్రేక్ పడుతుందని, ఈవారం మొదట్లోనే స్టాక్ మార్కెట్ నష్టాలను ఎదుర్కోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైంది. లావాదేవీలు అదే తరహాలో మందగొడిగా మొదలయ్యాయి. కానీ, దేశీయ మదుపరుల నుంచి అందిన మద్దతు మార్కెట్‌ను ఆదుకుంది. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో గత ఐదు పనిదినాల్లో కనిపించిన బుల్ రన్ ఆరో రోజు కూడా కొనసాగింది. భారీగా లాభాలు రాకపోయినప్పటికీ, నష్టాల ఊబిలో పడకుండా తప్పించుకుంది. ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరగడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపినప్పటికీ, పతనం నుంచి తట్టుకున్న సెనె్సక్స్ లాభాల్లోనే ముగిసింది. స్థూల జాతీయోత్పత్తి కొంత తగ్గడం మదుపరులను ఆందోళనకు గురి చేసింది. దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని భయపడినప్పటికీ, అనుకున్నంత ప్రమాదమేమీ లేకుండా సోమవారం నాటి లావాదేవీలు ముగిశాయి. ఎస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, వేదాంత, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్ తదితర కంపెనీల షేర్లు సగటున 5 శాతం లాభాలను ఆర్జించాయి. ఇన్‌సైడర్ ట్రేడ్‌కు సెబీ మళ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, సన్‌ఫార్మా నారీగా నష్టపోయింది. ఆ కంపెనీ షేర్లు సుమారు ఏడు శాతం నష్టాన్ని చవిచూశాయి. ఈవారం మొదటి రోజున జరిగిన ట్రేడింగ్‌లో సన్‌ఫార్మాతోపాటు మహీంద్ర అండ్ మహీంద్ర, ఐటీసీ, హీరో మోటోకార్ప్, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ బ్యాంక్ నష్టపోయిన సంస్థల జాబితాలో ఉన్నాయి.