బిజినెస్

50శాతం పెరిగిన ఐటీ రిటర్న్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: క్రితం సంవత్సరంతో పోలిస్తే 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఇప్పటి వరకు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసిన ప్రజల సంఖ్య 50 శాతం పెరిగి, 6.08 కోట్లకు చేరుకుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ సుశీల్ చంద్ర మంగళవారం ఇక్కడ ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు రోజయిన 2019 మార్చి 31నాటికి రెవెన్యూ డిపార్ట్‌మెంట్ రూ. 11.5 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూలు లక్ష్యాన్ని సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘దేశంలో పన్ను విస్తృతిని పెంచడానికి పెద్ద నోట్ల రద్దు చాలా బాగా పనిచేసింది. ఈ సంవత్సరం (అసెస్‌మెంట్ సంవత్సరం 2018-19) ఇప్పటి వరకు 6.08 కోట్ల పన్ను రిటర్న్‌లు మాకు అందాయి. గత సంవత్సరం ఇదే తేదీ నాటికి తమకు అందిన పన్ను రిటర్న్‌లతో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ. ఇది నోట్ల రద్దు ప్రభావమే’ అని సుశీల్ చంద్ర అన్నారు. అయితే, నిర్దిష్టంగా ఏ తేదీ నాటికి పన్ను రిటర్న్‌లు 6.08 కోట్లకు చేరాయనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అక్రమ నిధుల ప్రవాహాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం 2016 నవంబర్‌లో రూ. 500, రూ. 1000 డినామినేషన్ గల నోట్లను రద్దు చేసింది. ‘మన మొత్తం ప్రత్యక్ష పన్ను వృద్ధి రేటు 16.5 శాతం. నికర ప్రత్యక్ష పన్ను వృద్ధి రేటు 14.5 శాతం. పన్ను పునాది విస్తృతికి నోట్ల రద్దు నిజంగా ఉపయోగపడిందనే విషయాన్ని ఇది సూచిస్తోంది. ఇప్పటి వరకు చూస్తే ప్రత్యక్ష పన్నుల మొత్తం అంచనా బడ్జెట్‌లో 48 శాతం ఉన్నాయి’ అని సీబీడీటీ చీఫ్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా పన్ను చెల్లించే కార్పొరేట్ల సంఖ్య ఎనిమిది లక్షలకు పెరిగిందని ఆయన వివరించారు. ఇండస్ట్రీ బాడీ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సుశీల్ చంద్ర మాట్లాడుతూ, సీబీడీటీ 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరంలో ఇప్పటి వరకు 2.27 కోట్ల రిఫండ్‌లు ఇచ్చిందని వెల్లడించారు.