బిజినెస్

‘వావ్’ విస్తరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: వావ్ ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తరణకు నడుం బిగించింది. ఆర్థిక ఇబ్బందులతో అతలాకుతలమవుతున్న ఈ సంస్థ ఇటీవలే ఇండిగో వంటి సంస్థలతో చర్చలు జరిపింది. ఐస్‌లాండ్‌లో జరిగిన ఈ చర్చలు సఫలమయ్యాయని, అందుకే విస్తరణ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నదని నిపుణులు అంటున్నారు. కాగా, శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ జైన్ మాట్లాడుతూ, తమ మాతృ సంస్థ ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్‌తో చర్చలు జరిపిన తర్వాత వావ్ ఎయిర్‌లైన్స్ అభివృద్ధికి మార్గం సులభతరమైందని పేర్కొన్నారు. ఫ్రాంటియర్, ఇండిగో సంస్థల నుంచి పెట్టుబడులు సమకూరుతాయని, ఆ మొత్తంతో విస్తరణ సాధ్యమవుతుందని తెలిపారు. అయితే, ఆ రెండు సంస్థల నుంచి వావ్ ఎయిర్‌లైన్స్‌కు ఎంత మొత్తం అదనపు పెట్టుబడులు లభిస్తాయనే విషయాన్ని ఆమె వల్లడించలేదు. భారత దేశంలో విమానయాన సర్వీసులకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. విస్తరణ ద్వారా మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు.