బిజినెస్

బొగ్గు ఆధారిత పరిశ్రమలకు గడ్డుకాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 8: ఒడిశాలోని బొగ్గు ఆధారిత పరిశ్రమలు గడ్డుకాలం ఎదుర్కొంటున్నాయ. దీంతో రాష్ట్రంలోని పవర్ ప్లాంట్లపై ప్రభావం పడుతుందని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయ. ఈ విషయమై ఉత్కల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (యూసీసీఐ) స్పందిస్తూ దీనిపై ఆలోచనలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇదే పరిస్థితి ఎదురైతే రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తుందని, మేజర్ ఇండస్ట్రీ వాటాదారులతో కలిసి దీర్ఘకాలిక దృష్టి సారిస్తామని తెలిపింది. బొగ్గు ఉత్పత్తి చేయడంలో దేశంలోనే ఒడిశా అతిపెద్ద రాష్టమ్రని గుర్తుచేసింది. దురదృష్టవత్తూ తమ సొంత బొగ్గు ఆధారిత పరిశ్రమలు, తమ సొంత భూమిలో ప్రాధాన్యతకు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయలో జరిగే చర్చా వేదికల్లో వాటాదారులకు తగిన సాయం అందడం లేదని యూసీసీఐ ప్రెసిడెంట్ రమేశ్ మహాపత్రా పేర్కొన్నారు. ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని చాంబర్ అభ్యర్థించినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ తెలిపారు. అవసరమైతే దీనిపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అభిజిత్ పాటిని కలవనున్నట్లు వేదంతా లిమిటెడ్ సీఈవో పేర్కొన్నారు. 60-70 శాతం పవర్ ప్లాంట్లు స్థాపించగా బొగ్గు కొరతతో నష్టాల్లో ఉన్నాయని, దీంతో రాష్ట్ర, జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నారు.