బిజినెస్

త్వరలో విద్యుత్ రంగంలో సంస్కరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: వచ్చే మార్చినాటికి ‘అందరికీ విద్యుత్’ లక్ష్యాన్ని చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నడుంబిగించింది. ఇందులో భాగంగా 2019 నుంచి విద్యుత్ శాఖలో సంస్కరణలను అమలు చేసే అజెండాతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. బొగ్గు కొరత కారణంగా ఓవైపు విద్యుత్ ఉత్పాదనకు ఆటంకం కలగడంతోబాటు, పెరిగిన విద్యుత్ ధరలు, ఆర్థిక వత్తిడి వంటి సమస్యలు ఎదురవుతున్న క్రమంలో వినియోగదారుల కోరిక మేరకు సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకునే వీలుకల్పించాలని ప్రభుత్వం తీర్మానించింది. ప్రభుత్వ ‘సౌభాగ్య‘ పథకం ద్వారా అన్ని నివాస గృహాలకూ విద్యుత్ కనెక్షన్లు కల్పించే విషయంలో లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయడంతోబాటు విద్యుత్ శాఖ సవరణ బిల్లు ప్రతిపాదనలను అమల్లోకి తేవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ బిల్లు సవరణ జరిగితే క్యారేజి, కంటెంట్ వ్యాపారాలను విడదీయడానికి వీలుకలుగుతుంది. అందువల్ల వినియోగదారుడు తమకు అనుగుణంగా టెలికాం, లేదా మరేదైనా సర్వీస్ ప్రొవైడర్లలాగే మార్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. మొత్తం 16,320 కోట్లతో చేపట్టిన ‘సౌభాగ్య పథకం’ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే 2.2 కోట్ల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు కల్పించింది. 2019 నాటికి మరో 78 లక్షల కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. గడచిన యేడాది కాలం విద్యుత్ రంగం గణనీయమైన అభివృద్ధి పథాన్ని అందుకుంది.
దేశంలోని అన్ని పల్లెలకూ వచ్చే ఏప్రిల్ నాటికి విద్యుత్ వెలుగులు అందుతాయని, భారత ప్రభుత్వం చేపట్టిన విద్యుదీకరణ చర్యలపై యావత్ ప్రపంచం దృష్టి నిలిపిందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ పీటీఐకి చెప్పారు. ప్రస్తుతం ‘అందరికీ విద్యుత్’ పథకం అమలుపై ప్రత్యేక దృష్టినిలిపామని ఆయన చెప్పారు. విద్యుత్ ఉత్పాదక కేంద్రాలకు వౌలిక వసతుల కల్పన, విస్తరణ, బలోపేతం చేయడం ద్వారా ఉత్పాదన పెంచేందుకు బదలాయింపు, సరఫరా విషయంలోనూ సక్రమ చర్యల అమలుకు అనుగుణంగా ‘విద్యుత్ చట్టం, ధరల విధానం’లో సవరణలు తీసుకురానున్నట్టు సింగ్ వివరించారు. పారిశ్రామిక పరంగా ఎదురవుతున్న పలు సమస్యల పరిష్కారానికి యాజమాన్యాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, ఈ విషయంలో తమ సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోనికి తీసుకోవాలని కోరుతున్నారని మంత్రి చెప్పారు. కాగా విద్యుత్ ఉత్పాదకుల సంఘం (ఏపీపీ) డైరెక్టర్ అశోక్‌కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ శాఖకు గడచిన యేడాది కొన్ని సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ సంక్లిష్టమైన సంవత్సరమేనని చెప్పారు. కొత్త బొగ్గు కేటాయింపు వౌలిక సూత్రాలు ఏర్పాటు ద్వారా ‘శక్తి’ పథకం 9 జిడబ్ల్యు ఆపరేషనల్ సామర్ధ్యం పెరిగిందన్నారు. ఈ పథకానికి సంబంధించిన అంశాలను సమీక్షించాలని న్యాయస్థానం ద్వారా ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులు చేసిందన్నారు.