బిజినెస్

మహీంద్రా నుంచి ఎస్‌యూవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 19: ఆటోమొబైల్ రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కాంపాక్ట్ ఎస్‌వీయూ విభాగంలో కొత్తగా ఐదు సీట్లతో కూడిన ‘ఎక్స్‌యూవీ 300’ వాహనాన్ని రూపొందించింది. వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఈ వాహనాన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు సంస్థ అధికార వర్గాలు వెల్లడించాయి. ఎక్-100 శాఖలో ఈ వాహనాన్ని మహీంద్రా కొరియా వాటాదారు స్సాంగ్‌యాంగ్ టివోలీ సంస్థ అటు పెట్రోలు, ఇటు డీజిల్ వినియోగానికి వీ లుగా తయారు చేసింది. 2015లో ఆ కొరియన్ కంపెనీ ఈ వాహనాన్ని తయారు చేసినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో 2.6 లక్షల వాహనాలను విక్రయించింది. కాగా ప్రస్తుతం ఎస్‌వీయూ విభాగంలో 60 శాతం కాంపాక్ట్ ఎస్‌వీయూ ఆక్రమించిందని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయంకా తెలిపారు. కొత్త వాహనం ద్వారా దేశంలోని 15 శాతం మార్కెట్‌ను సంతరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎక్స్‌యూవీ 300 వాహనంలో అడ్వాన్స్‌డ్ యూనిక్ ఫీచర్స్‌తో ఆకర్షణీయంగా రూపొందించడం జరిగిందని, ఉన్నత విలువలు కలిగిన ఈ వాహనాన్ని ప్రీమియం ప్రాడక్టుగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ప్రతి యేటా కాంపాక్ట్ ఎస్‌వీయూ విభాగంలో 44 శాతం వృద్ధిని తమ కంపెనీ గత ఐదేళ్ల కాలంగా అందుకుంటోందన్నారు. 35నుంచి 40 వేల వాహనాలను ప్రతినెలా కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొస్తున్నామని గోయెంకా వివరించారు. త్వరలో ఈ ఎక్స్‌యూవీ 300 వాహనాన్ని నాసిక్‌లోని మహీంద్రా కర్మాగారంలో తయారీని చేపడతామని ప్రకటించారు. దేశీయంగా విజయవంతం అయ్యాక రెండు విదేశాల్లో సైతం తమ కంపెనీ తరపున ఈ వాహనాన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెడతామని చెప్పారు.