బిజినెస్

ఓఎన్‌జీసీ షేర్ల ‘బైబ్యాక్‌‘కు బోర్డు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) 25.29 కోట్ల షేర్లను బైబ్యాక్ కార్యక్రమం ద్వారా వెనక్కు తీసుకోనుంది. ఈ షేర్ల మొత్తం విలువ 4,022 కోట్లు కాగా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు గురువారం ఇక్కడ జరిగిన ఆ సంస్థ బోర్డు సమావేశం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థలను వాటి మిగులు నిధుల ఆధారంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే ఓఎన్‌జీసీ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో ప్రభుత్వ వాటా 65.64 శాతం ఉంది. కాగా బైబ్యాక్ కార్యక్రమం ద్వారా ఈ వాటాల్లో కొంత భాగాన్ని వేలానికి పెట్టి 2,640 కోట్ల రూపాయల నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం చెల్లింపులు జరిగి ఎక్కువ డివిడెండ్‌తో వున్న ఈక్విటీ షేర్లలో 1.97 శాతం ఒక్కో షేర్ విలువ 159 రూపాయలుగా ఉన్న వాటిని 25.29 కోట్ల షేర్లకు మించకుండా ఈ బైబ్యాక్ పథకం ద్వారా వెనక్కు తీసుకోనున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వ రంగ, అనుబంధ సంస్థల బడ్జెట్‌లోటును పూడ్చేందుకు ఆ సంస్థలకు సంబంధించిన షేర్లపై వచ్చే అధిక డివిడెండ్‌ను చెల్లించడం, లేదా షేర్లను విక్రయించడం వంటి చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి ఓఎన్‌జీసీ ఎలాంటి మధ్యంతర డివిడెండ్‌నూ చెల్లించడం లేదని, మూలధన ఖర్చుల పద్దుల గణన అనంతరం ఈ సంస్థకు ఎలాంటి అదనపు నిధులూ లేవని తేలిందని అధికారులు చెబుతున్నారు. ముంబ యి స్టాక్ ఎక్చేంజీలో ఓఎన్‌జీసీ షేర్ విలువ లాభనష్టాలకుఅతీతంగా మంగళవారం ప్లాట్‌గా 148.65 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. ఈక్రమంలో ఈ కంపెనీ షేర్లను తిరిగి కొనుగోలు చేసుకుని మళ్లీ వేలానికి పెట్టడం ఈ బైబ్యాక్ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తారు. అంటే కంపెనీ మదుపర్లకు షేర్ల మార్కెట్ విలువను చెల్లించి తిరిగి ఆ షేర్లపై ఒకవంతు యాజమాన్య హక్కులను కంపెనీ తనవద్దే ఉంచుకుంటుంది. బైబ్యాక్ అనంతరం 6,556 కోట్ల రూపాయలను అదనంగా మధ్యంతర డివిడెండ్ చెల్లింపుకోసం ఖర్చు చేయనున్నట్టు ఈనెల ప్రథమార్థంలో ఓఎన్‌జీసీ ప్రకటించింది. ఇలావుండగా ఈ సంస్థ బోర్డు సమావేశం మొత్తం 3.06 శాతం వాటాను బైబ్యాక్ చేసుకోవడానికి తాజాగా ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే సుమారు అరడజనుకు పైగా ప్రభుత్వ రంగ, అనుబంధ సంస్థలు షేర్ బైబ్యా క్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇందులో ఎన్‌హెచ్‌పీసీ, కోల్ ఇండియా, ఆయిల్ ఇండియా, బీహెచ్‌ఈఎల్, ఎన్‌ఏఎల్‌సీఓ, ఎన్‌ఎల్‌సీ, కొచ్చిన్ షిప్ యార్డు, కేఐఓసీఎల్ వంటి ప్రముఖ సంస్ధలున్నాయి. ఈ సంస్థల షేర్ బైబ్యాక్ కార్యక్రమం ద్వారా కనీసం ఐదువేల కోట్లు సమకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే ఐఓసీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రతి వాటాలోని 6.75 శాతాన్ని మధ్యంతర డివిడెండ్‌గా మదుపర్లకు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం పన్నులను మినహాయించుకుని 6,556 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్ను కింద మొత్తం 3,544 కోట్లు అందుతుంది.