బిజినెస్

గుజరాత్‌కు ‘స్టార్టప్’ ఫస్ట్‌ర్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: స్టార్టప్(అంకురాలు) ఏర్పాటుకు అత్యంత అనువైన రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. చిన్న వ్యాపార సంస్థలు ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహం, వౌలిక సదుపాయాలు, పర్యావరణ అనుకూలతలో గుజరాత్ ముందుండి ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. ఇండస్ట్రియల్ పాలసీ, ప్రమోషన్ శాఖ (డీఐపీపీ) విడుదల చేసిన ర్యాంకింగ్‌లో గుజరాత్ అగ్రస్థానంలోనిలిచింది. స్టార్టప్ పాలసీ, ఇంకుబేషన్, ప్రొక్యూర్‌మెంట్, కమ్యూనికేషన్ అంశాలను పరిగణనలోకి తీసుకున్న డీఐపీపీ రాష్ట్రాలను వర్గీకరించింది. రాష్ట్రాల పనితీరును బట్టి బెస్ట్ ఫెర్‌ఫార్మర్(అత్యుత్తమ ప్రదర్శన), టాప్ ఫెర్‌ఫార్మర్స్(మెరుగైన నిపుణత), లీడర్స్(మార్గ నిర్దేశం), యాస్పరెన్స్ లీడర్స్(ఆశాజనక ప్రదర్శన),ఎమర్జంగ్ స్టేట్స్(అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు), బిగినర్స్(ప్రారంభ ప్రదర్శన)గా వర్గీకరించారు. అత్యుత్తమ ర్యాంకింగ్ గుజరాత్ సాధించింది. కర్నాటక, కేరళ, ఒడిశా, రాజస్థాన్ మెరుగైన ప్రదర్శన కేటగిరీలోనిలిచాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాయకత్వ నైపుణ్యత కేటగిరిలో ఎంపికయ్యాయి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి యాస్పరింగ్ తరువాత ర్యాంకింగ్ సాధించాయి. ఢిల్లీ, గోవా, అస్సా వంటి ఎనిమిది రాష్ట్రాలు ప్రారంభదశలోనే ఉన్నట్టు డీఐపీపీ వెల్లడించింది.

చిత్రం..దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల స్టార్టప్ ర్యాంకింగ్‌లను విడుదల చేస్తున్న కేంద్ర వాణిజ్య
పారిశ్రామిక విభాగం కార్యదర్శి రమేష్ అభిషేక్, అదనపుకార్యదర్శి చతుర్వేది