బిజినెస్

జోన్‌లో తొలి జన ఆహార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 20: ప్రయాణికుల భోజనం ఇక నుంచి ప్రైవేటుపరం కానుంది. రైల్వేకు, ఐఆర్‌సిటీసీలకు ఎటువంటి సంబంధం లేకుండానే కేవలం ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో దీనిని నిర్వహించాలని నిర్ణయించింది. అదీ ఏ-క్యాటగిరీలకు చెందిన రైల్వే స్టేషన్లను గుర్తించి వాటి ద్వారానే తొలి ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. పసందైన రుచులతో ప్రయాణికులకు జన ఆహార్ పేరుతో భోజనం అందించాలనేది రైల్వే ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా భారతీయ రైల్వేలో పరిధిలో ఉన్న 17 రైల్వే జోన్లు, 48 డివిజన్లకు సంబంధించి తొలి దశలో ఏ-1 కేటగిరీలుగా గుర్తించిన రైల్వే స్టేషన్లలో మాత్రమే జన ఆహార్ పథకాన్ని ప్రవేశపెట్టారు. వీటన్నింటిలో జన ఆహార్ పథకాన్ని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలోనే (ప్రైవేటీకరణ) నిర్వహించనుంది. ఇందులోభాగంగా ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ ఏ-1 రైల్వేస్టేషన్‌గా గుర్తించబడిన విశాఖ రైల్వేస్టేషన్‌లో జన ఆహార్ అందుబాటులోకి వచ్చింది. దీనివలన విశాఖ రైల్వే స్టేషన్‌లో నిత్యం రాకపోకలు సాగిస్తున్న వందకు పైగా రైళ్ళ ద్వారా తిరిగే దాదాపు 50 వేల మంది ప్రయాణికులకు భోజన సదుపాయం కలుగుతుంది. అలాగే రైల్వేస్టేషన్‌లో ఉన్న 12 రైల్వే విభాగాలకు చెందిన సిబ్బందికి ఇది అందుబాటులో ఉంటుంది. జన ఆహార్ అందుబాటులోకి రావడంతో ఇప్పటివరకు నిర్వహించే పాంట్రీకార్‌లు, బేస్‌కిచెన్లకు రైల్వే పూర్తిస్థాయిలో స్వస్తిపలికినట్టే. ఈ రెండింటి నిర్వహణతో అనేక రకాలైన భారాలు మోయాల్సి వస్తోందని భావించిన రైల్వే బేస్ కిచెన్లను ఎత్తివేయగలిగింది. దూర ప్రాంతాల మధ్య నడిచే సూపర్‌పాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో ప్రయాణికులు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం తినేందుకు స్టేషన్‌కు చేరుకునేలోపు ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. ఆర్డర్‌పై భోజనం సిద్ధం చేయడంతోపాటు సంబంధిత రైల్వేసిబ్బంది వీటిని ప్రయాణికులకు అందించే బాధ్యత తీసుకునేవారు. ఈ విధంగా నడిచే బేస్‌కిచెన్ల నిర్వహణలో భాగంగా కనీసం 15నుంచి 20 మంది సిబ్బంది పని చేయాల్సి వచ్చేది. వీరందరికీ ప్రతినెల వేతనాలు చెల్లించడం జరిగేది. బేస్‌కిచెన్లలో కొత్తగా నియామకాలంటూ ఉండేవికావు. కాస్తంత అనుభవం కలిగి ఉండే ఆయా రైల్వేవిభాగాల్లో క్షేత్రస్థాయి సిబ్బందికి కాస్తంత శిక్షణినిచ్చి వీటిలోకి తీసుకునేది. నాణ్యమైన భోజనం లేకపోవడం, సిబ్బంది వేతనాల భారం వంటి కారణాలతో కొద్దికాలానికే దీనికి చరమగీతం పాడాల్సి వచ్చింది. వీటి కంటే ముందు నుంచి నిర్వహించే పాంట్రీకార్‌లను సైతం పూర్తిస్థాయిలో తొలగించాలని రైల్వే నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో ఒక కోచ్‌ను పాంట్రీగా మార్పు చేసి ఇందులో భోజన తయారీతోపాటు ప్రతికోచ్‌కు పార్శిళ్ళ ద్వారా ప్రయాణికులకు దీనిని అందుబాటులోకి తీసుకువచ్చే విధానం అనాదిగా వస్తూనే ఉంది. ఈ విధంగా నడిచే పాంట్రీల వలన దీని ద్వారా వెలువడే కాలుష్యం ప్రయాణికుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేదిగా మారింది. దీనిపై రైల్వేకు అనేక పిర్యాదులు వెళ్ళాయి. అలాగే నాణ్యత కొరవడే భోజనంతోను ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రతిఒక్క పాంట్రీకార్ నిర్వహణతో కనీసం పది మంది రైల్వేసిబ్బంది ఉండేవారు. వీరందరికీ వేతనాలు చెల్లించడం భారంగా మారింది. పాంట్రీల నిర్వహణతో కొచ్‌ల కొరత ఏర్పడుతుంది. అదే పాంట్రీకీ ఉపయోగించే కోచ్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడం వలన బెర్తుల సమస్య చాలామటుకు తీరిపోతుందని భావించిన రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో వీటిని క్రమేపీ తొలగించుకుంటూ వస్తోంది. విశాఖ రైల్వేస్టేషన్ నుంచి వెళ్ళే సమత (12807), స్వర్ణజయంతి (12803), హిరాఖండ్ (18507), విశాఖపట్నం-నాందేడ్ (20811), విశాఖపట్నం-గాంధీగ్రామ్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో పాంట్రీకార్‌ల సదుపాయం ఉంది. వీటితోపాటు మిగిలిన రైల్వేజోన్లకు చెందిన మరో 20 రైళ్ళల్లోను పాంట్రీలున్నాయి. అయితే ప్రయాణికులకు ఎటువంటి ప్రయోజనం లేని అనేక రకాలుగా నష్టాలను తెచ్చిపెడుతున్న ఈ పాంట్రీలను పూర్తిస్థాయిలో తొలగించాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం వీటి స్థానంలో జన ఆహార్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ఇపుడు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నందున బేస్‌కిచెన్ల మాదిరి పాంట్రీలను పూర్తిగా లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.