బిజినెస్

మార్కెట్ గట్టెక్కింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో గురువారం లావాదేవీలు అత్యంత నాటకీయంగా కొనసాగాయి. వరుసగా ఏడు రోజులు లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్ ఎవరూ ఊహించని విధంగా, ఒక్కసారిగా కుంటుపడింది. ఉదయం ట్రేడింగ్ మొదలైన క్షణం నుంచి ఒడిదుడుకుల మధ్య ప్రయాణం కొనసాగించింది. ఒకానొక దశలో బుల్ రన్‌కు బ్రేక్ పడుతుందని, మార్కెట్ కుప్పకూలుతుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, భారీ పతనం నుంచి కోలుకున్న మార్కెట్ చివరికి 52.66 పాయింట్లు (0.14 శాతం) నష్టపోయ, 36,431.67 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే మార్కెట్ పతనం మొదలుకావడంతో పదుమరులు మరింతగా ఆచితూచి వ్యవహరించారు. వడ్డీ రేటును అమెరికా ఫెడరల్ రిజర్వ్ స్వల్పంగా పెంచడంతో, దాని ప్రభావం ప్రపంచ మార్కెట్‌పై పడింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ విధంగా వడ్డీని పెంచడం ఈ ఏడాది ఇది నాలుగోసారి. 2.25 శాతం నుంచి 2.50 శాతానికి వడ్డీ రేటు చేరుకోవడంతో, బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలవైపు పెట్టుబడిదారులు దృష్టి సారించారు. దీనితో, ఒక దశలో 250 పాయింట్ల వరకూ సెనె్సక్స్ పతనమైం ది. ఇది మరింతగా పెరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, దేశీయ మదుపరులు ఆసక్తిని ప్రదర్శించి, మార్కెట్‌ను ఆదుకున్నారు. వారి సానుకూల వైఖరే మార్కెట్‌ను భారీ నష్టాల బారిన పడకుండా రక్షించింది. ఎస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, మహీంద్ర అండ్ మహీంద్ర, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, టాటా మోటర్స్, ఎల్ అండ్ టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటాలు లాభాలను ఆర్జించాయి. భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, విప్రో, వేదాంత, మారుతీ సుజికీ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలను చవిచూశాయి.