బిజినెస్

కొత్త టెక్నాలజీతో 500 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: సెకనులో 500 బెగాబైట్స్ (ఎంబీపీఎస్) డౌన్‌లోడింగ్ సాధ్యమా అనే ప్రశ్నకు అవునననే సమాధానమిస్తున్నాయి భారతీ ఎయిర్‌టెల్, ఎరిక్‌సన్ సంస్థలు. స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్‌తో కుదిరిన ఒప్పందం మేరకు 4జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మొదటిసారి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించామని, ఇన్‌డోర్‌లో 500 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ అవుతున్నదని ఎయిర్‌టెల్, ఎరికసన్ సంస్థలు శుక్రవారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఔట్‌డోర్‌లో ఇది 400 ఎంబీపీఎస్ వరకూ ఉంటుందని వివరించాయి. హై స్పీడ్ 4జీ నెట్‌వర్క్‌కు భారత దేశంలో విస్తృత మార్కెట్ ఉంటుందని రెండు కంపెనీలు ధీమాతో ఉన్నాయి.