బిజినెస్

నేడు ప్రభుత్వ రంగ బ్యాంకుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు బుధవారం సమ్మె చేపట్టనున్నారు. తొమ్మిది ఉద్యోగ సంఘా ల పిలుపుమేరకు జరుగనున్న ఈ ఆందోళన కార్యక్రమంతో బ్యాంకుల సేవలు స్తంభించనున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాతో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను విలీనం చేయాల న్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను నిరసిస్తూ ఈ సమ్మె చేపడుతున్న సం గతి తెలిసిందే. కాగా వారం రోజుల వ్యవధిలో వరుసగా ఇది బ్యాంకుల రెండో సమ్మె కావడం గమనార్హం. ఈ నెల 21న శుక్రవారం బ్యాంకు అధికారులు తమ వేతన సవరణ ఒప్పందా న్ని అమలు చేయాలంటూ సమ్మె చేసి న విషయం విధితమే. ఇప్పటికే అనేక బ్యాంకులు ఈ సమ్మె విషయాన్ని ఖాతాదార్లకు ముందుగా తెలియజేయడం జరిగింది. ఇలావుండగా ప్రైవే టు బ్యాంకులు మాత్రం బుధవారం యథావిధిగా పనిచేస్తాయి. కాగా తొ మ్మిది ఉద్యోగ సంఘాలు ఒకే గొడుగుకింద పనిచేస్తున్న యునైటెడ్ ఫో రం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) బుధవారం నాటి సమ్మెకు నాయకత్వం వహించనుంది. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్ (ఏఐబీఓసీ) ప్రధాన కార్యద ర్శి సీహెచ్ వెంకటాచలం ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ డిమాండ్లపై అదనపు చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో తమకు ఎలాం టి హామీలూ ఇవ్వలేదని, దీంతో స మ్మెను బలోపేతం చేయకతప్పలేదని అన్నారు. మూడు బ్యాంకులను విలీ నం చేయబోమని అటు బ్యాంకు యాజమాన్యాలు, ఇటు ప్రభుత్వం కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదన్నా రు. బ్యాంకులను విలీనం చేయడం ద్వారా సైజు పెంచాలని ప్రభుత్వం చూస్తోందని, అయితే దేశంలోని అ న్ని బ్యాంకులను ఒక్కటి చేసినా జా తీయ స్థాయిలో 10 అగ్ర బ్యాంకుల జాబితాలో స్థానం దక్కడం అసాధ్యమన్నారు. అధికారుల వేతన సవరణ సైతం 2017 నవంబర్ నుంచి పెండింగ్‌లో ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇవ్వ జూపిన 8 శాతం వేతన పెంపు ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు అంగీకరించలేదని తెలిపారు.