బిజినెస్

దోబూచులాడుతున్న టమోటా ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, డిసెంబర్ 25: మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు రోజురోజుకు హెచ్చుతగ్గులతో దోబూచులాడుతున్నాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో టమోటా ధరలు కిలోకు రూపాయి నుంచి రెండురూపాయలు పలుకుతున్నాయి. పడమటి మండలాల నుంచి కాకుండా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి మంగళవారం మదనపల్లె మార్కెట్‌కు 340టన్నుల టమోటా దిగుమతి అయ్యింది. జిల్లా టమోటాకు తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేరి, గోవా రాష్ట్రాలలో డిమాండ్ ఉండటం.. అధికదిగుబడులు వస్తుండటంతో ధరలు కూడా గిట్టుబాటు కల్గిస్తోంది. మదనపల్లెమార్కెట్‌లో ధరలు పెరుగుతుండటంతో బి.కొత్తకోట, అంగళ్ళు, ములకలచెరువు, గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికరి, పుంగనూరు, చింతపర్తి, తరిగొండలలో టమోటా మార్కెట్‌ల నుంచి మదనపల్లె మార్కెట్‌కు తరలించేందుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. వివిధ రాష్ట్రాలకు ఎగుమతుల విస్తరణ పెరిగింది. రాష్ట్రంలోని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ,ఆదోని, కాకినాడ, బాపట్ల, తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటక గోవా రాష్ట్రాలకు ఎగుమతులు విస్తరించాయి. పొరుగు రాష్ట్రాల్లో టమోటా డిమాండ్ పెరగడం, ఇక్కడ సాగు అధికంగా ఉండటం టమోటా రైతులకు కలిసొచ్చింది. ఒక్కొక్కసారి తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, పాండిచ్ఛేరి రాష్ట్రాల్లో టమోటా ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం.. అక్కడి వ్యాపారులు మదనపల్లి మార్కెట్‌కు వలస రావడంతో టమోటాకు డిమాండ్ మేరకు మార్కెట్‌లో ధరలలో వ్యత్యాసాలు కన్పిస్తున్నాయి. మంగళవారం క్రిస్‌మస్ పండుగరోజు మార్కెట్‌కు 340టన్నుల టమోటా వచ్చింది. అందులో మొదటి రకం టమోటా పదికిలోలు రూ.50లు, రెండవ రకం రూ.35లు పలికింది.

చిత్రం..మంగళవారం మదనపల్లె మార్కెట్‌కు వచ్చిన టమోటాలు