బిజినెస్

బ్యాంకుల సమ్మె విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 26: ప్రభుత్వ రంగంలోని విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేసే ప్రయత్నాలను నిరసిస్తూ దేశ వ్యాప్త పిలుపు మేరకు బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలోని బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు నిర్వహించిన సమ్మె విజయవంతమైంది. దీంతో దాదాపు 5వేల వివిధ బ్యాంక్‌ల బ్రాంచీలు మూతపడ్డాయి. కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. ఈ సందర్భంగా విజయవాడ నగరంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కార్యాలయం వద్ద భారీ ఎత్తున ధర్నా జరిగింది. మూడు బ్యాంక్‌ల విలీనం ద్వారా అటు బ్యాంక్‌లకుగానీ ఇటు ఖాతాదారులకు ప్రయోజనం ఉండబోదని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ నాయకులు, ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘ ఉప ప్రధాన కార్యదర్శి జీవీ రమణ అన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కానె్ఫడరేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లారుూస్ అసోసియేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్, ఇతర 9 యూనియన్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌లో భాగంగా ఉన్నాయని ఆయన అన్నారు. బ్యాంక్ ఉద్యోగుల వేతన ఒప్పందం త్వరగా జరిగాలని ఎస్‌బీఐ అధికారుల సంఘ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీఆర్‌కే మోహన్ డిమాండ్ చేశారు.