బిజినెస్

అంతర్జాతీయ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయ వివరాలివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు అంతర్జాతీయంగా ఉన్న ఆస్తులు, వాటిద్వారా సమకూరుతున్న ఆదాయ వివరాలను వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) బుధవారం ఆదేశించింది. ఈ యేడాది ఏప్రిల్ నాటికి ఎయిర్ ఇండియా ఆస్తుల ద్వారా వస్తున్న కిరాయి, లీజు వివరాలు, మొత్తం ఆస్తుల విలువ, విస్తరణ తదితర వివరాలను ఇవ్వాల్సిందిగా కోరుతూ అసీమ్ తక్యార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. అయితే ఇది సంస్థ గోప్యతకు భంగం కలిగించేలా ఉందని, దీనిపై సమాచారం ఇవ్వడం కుదరదని ఎయిర్ ఇండియా బదులివ్వడాన్ని కేంద్ర సమాచార కమిషన్ తప్పుబట్టింది. ఇందుకు సంబంధించి ఆ సంస్థ చేసుకున్న విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. తాక్యార్ అడిగిన సమాచారం వాణిజ్య పరమైన గోప్యతకు సైతం విఘాతం కలిగించేదిగా ఉందన్న ఎయిర్ ఇండియా వాదనతో సీఐసీ ఏకీభవించలేదు. ఇందుకు సంబంధించిన సరైన వివరణను ఇవ్వడంలో ఎయిర్ ఇండియా సంస్థ విఫలమైందని సమాచార కమిషనర్ దివ్యప్రకాష్ సిన్హా పేర్కొన్నారు. వస్తున్న లీజు, రెంట్ తదితర ఆదాయాన్ని, చెల్లించాల్సిన బకాయిలను పిటిషనర్ తెసుకోగోరుతున్నాడని ఇది తెలిపినంత మాత్రాన వాణిజ్య పరమైన గోప్యతకు ఎలా భంగం వాటిల్లుతుందని సిన్హా ప్రశ్నించారు. హియరింగ్‌కు హాజరైన ఎయిర్ ఇండియా సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎలాంటి వాదనలూ వినిపించలేదని, తదుపరి కూడా ఉండబోవని స్పష్టం చేసిన దరిమిలా సమాచార హక్కు చట్టం కింద తక్యార్ అడిగిన వివరాలను ఇవ్వాల్సిందిగా ఆదేశించామని కమిషనర్ సిన్హా తెలిపారు.