బిజినెస్

నిష్క్రమణల సంవత్సరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత దేశ బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నో చేదు అనుభవాలను, తీపి గుర్తులను నిక్షిపత్తం చేసుకుంటూ 2018 ముగియబోతోంది. వేలాది కోట్ల రూపాయల రుణాల ఎగవేతలు, అప్పులు తీసుకున్న వ్యక్తుల పరారీ, సీఈవోలకు ఉద్వాసన వంటివి ఈ రంగాన్ని కుదేలు చేశాయి. వివిధ బ్యాంకులను ఆదుకునేందుకు ఎస్‌బీఐలో పలు బ్యాంకులను ప్రభుత్వం విలీనం చేయడం ఓ కీలక పరిణామం. ప్రభుత్వంతో వివిధ అంశాలపై ఏర్పడ్డ విభేదాల నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేని పరిణామమే. ఓ పక్క రికవరీ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ ఎన్‌పీఏలు బ్యాంకులకు భారంగా మారాయి. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహుల్ ఛోక్సీలు దాదాపు 14వేల కోట్ల రూపాయల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకును ముంచేసి పరారయ్యారు. వారిని స్వదేశం రప్పించేందుకు గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రయత్నాలు సఫలమయ్యే జాడలు కనిపించడం లేదు. అలాగే లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా వ్యవహారం ప్రభుత్వ ప్రయత్నాల కారణంగా ఓ కొలిక్కివచ్చే అవకాశం కనిపిస్తోంది. బ్రిటన్‌లో తిష్టవేసిన ఆయన్ని భారత్‌కు అప్పగించాలంటూ అక్కడి కోర్టు ఇటీవల తీర్పును ఇవ్వడం ఓ శుభపరిణామం. ఐసీసీఐ బ్యాంకు సీఈవోగా పనిచేసిన చందా కోచ్చర్‌పై ఆశ్రీత పక్షపాత ఆరోపణలు రావడం ఆ నేపథ్యంలోనే ఆమె తప్పుకోవడం కూడా బ్యాంకింగ్ రంగాన్ని పీడిస్తున్న సమస్యలకు మరో దుష్టాంతం. వీడియోకాన్ కంపెనీకి రుణాలు ఇవ్వడం, క్విడ్‌ప్రొకోకు పాల్పడడం, పారదర్శకత లోపించడం, వ్యక్తిగడ లబ్ధి కోచ్చర్ నిష్క్రమణకు దారితీశాయి. యాక్సిస్ బ్యాంక్ ఎండీగా శిఖాశర్మ పొడిగింపును ఆర్‌బీఐ నిరాకరించడం మరో ఉన్నత స్థాయి నిష్క్రమణకు దుష్టాంతం. 2020 వరకూ శిఖాశర్మ పదవీ కాలాన్ని పొడిగించాలని యాక్సిస్ బ్యాంక్ బోర్డు నిర్ణయించినప్పటికీ ఆమెకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకే కొనసాగే అవకాశం లభించింది. యెస్ బ్యాంక్ కూడా ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కొంది. బ్యాంక్ ఈసీవోగా రాణాకపూర్ పదవీ కాలాన్ని పొడిగించడాన్ని ఆర్‌బీఐ అడ్డుకుంది. గత ఏడాది ఇదే బ్యాంకుకు చెందిన అశోక్ చావ్లా చైర్మన్ పదవికి నవంబర్‌లో రాజీనామా చేశారు. ప్రైవేటు బ్యాంకులు సీఈవోలు తప్పుకోవడం మాట ఎలా ఉన్నా ఆర్‌బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ ఆకస్మిక రాజీనామా నిర్ణయం ప్రకంపనలు పుట్టించింది. వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకుంటున్నట్టు ఆయన చెప్పుకున్నా ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తికి సంబంధించిన అంశాలపై కేంద్రంతో తలెత్తిన విభేదాలే ఇందుకు దారితీశాయన్న వాదన బలంగా వినిపించింది. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా శశికాంత్ దాస్‌ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. మొత్తం మీద 2018 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్న బ్యాంకింగ్ రంగం కొత్త సంవత్సరంలో సమస్యలకు తావులేని రీతిలో ఆర్థిక పుష్టిని సంతరించుకోగలదన్న ఆశావహ దృక్పథం సర్వత్రా వ్యక్తమవుతోంది.

చిత్రాలు.. ఉర్జిత్ పటేల్ *చందకొచ్చర్ *విజయ్ మాల్యా *నీరవ్‌మోడీ