బిజినెస్

ఆగిన బ్యాంకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: విజయా బ్యాంక్, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడాన్ని వ్యితిరేకిస్తూ ఉద్యోగులు బుధవారం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెతో బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
జాతీయ బ్యాంకులతో పాటు కొన్ని ప్రైవేట్, విదేశీ బ్యాంకు లు కూడా ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఈ వారంలో రెండోసారి నిర్వహించిన ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా ఒక మిలియన్ ఉద్యోగులు పాల్గొన్నారని తొమ్మిది బ్యాంకు యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధులు తెలిపారు. కాగా తమ వేతనాలను వెంటనే పెంచాలని, బ్యాంకుల విలీనాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న ఆఫీసర్స్ యూనియన్ సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. సమ్మె వల్ల బుధవారం డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్‌క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌ల జారీ, ఇంకా ఇతర కార్యకలాపాలు నిలిచిపోయాయని బ్యాంకు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. కేవలం గోవా, గుజరాత్‌ల్లోనే రెండు ట్రిలియన్‌ల విలువైన చెక్‌లు నిలిచిపోయాయని చెప్పారు. తమకు మద్దతుగా కొన్ని ప్రైవేట్ రుణ సంస్థలు కూడా సమ్మెలో పాల్గొన్నాయని యూనియన్ నేత ఎంకె శుక్లా వెల్లడించారు. ఇలావుండగా బ్యాంకు సమ్మె వల్ల బ్యాంకుల కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం కలుగలేదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. చెక్‌ల క్లియరెన్స్‌కు క్లియరింగ్ సెంటర్లలో అధికారులను నియమించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశామని, అలాగే ట్రెజరీ కార్యకలాపాలు కూడా యధావిధిగా కొనసాగాయని ఆయన తెలిపారు.
చిత్రం..విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాతో
విలీనం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం సమ్మె చేస్తున్న సిబ్బంది