బిజినెస్

విమానాశ్రయాల్లో జీసీసీ స్టాళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: దేశీయ మార్కెట్‌లో అటవీ ఉత్పత్తులకు మరింత ఆదరణ లభించే విధంగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని రద్దీగా ఉండే విమానాశ్రయాలను ఉపయోగించుకోవాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. దీనివల్ల అటవీ ఉత్పత్తుల అమ్మకాలతోపాటు, వ్యాపార అభివృద్ధి, గిరిజన యువతకు ఉపాధి కూడా దొరుకుతుందని సంస్థ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతి విమానాశ్రయంలో జీసీసీ స్టాల్‌ను ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే పలు విమానాశ్రయాలకు జీసీసీ నుంచి లేఖలు వెళ్ళాయి. ఇందులో భాగంగా చెన్నై విమానాశ్రయంలో జీసీసీ స్టాల్ ఏర్పాటుకు సానుకూల స్పందన రావడంతో దీనికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని గన్నవరం విమానాశ్రయంలో త్వరలో జీసీసీ ప్రత్యేక స్టాల్ ఏర్పాటుకానుంది. ఇప్పటికే విశాఖ విమానాశ్రయంలో జీసీసీ స్టాల్ ఏర్పాటైంది. దీనికి విమాన ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించడంతో ప్రాథమికంగా చేపట్టిన ప్రయోగం విజయం సాధించినట్టు అయ్యింది. చెన్నై, గన్నవరం విమానాశ్రయాల్లో ఏర్పాటైన తరువాత రాజమహేంద్రవరంలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన అరకు కాఫీతోపాటు, కొత్తగా మార్కెట్‌లోకి దింపిన రాగితో తయారు చేసిన బిస్కెట్లు, అరకు వేలీ ఫిల్టర్ కాఫీ, ఇన్‌స్టంట్ కాఫీ, వేపిన జీడిపప్పు, కుంకుళ్ళ షాంపూ, ఉసిరి క్యాండీ ఈ స్టాళ్ళలో ఉంటాయి.