ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలోకి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 3: రాజమహేంద్రవరం ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టిడిపిలో చేరనున్నట్లు తెలిసింది. ఆయన వెంట కొంతమంది మాజీ కార్పొరేటర్లు, ప్రస్తుత కార్పొరేటర్లు కూడా పార్టీ మారనున్నారు. శనివారం వైసిపికి చెందిన ఒక నాయకుడి కుమార్తె పెళ్లి వేడుకల్లో ఆదిరెడ్డి పార్టీ మారే విషయం చర్చకు రాగా ఆదిరెడ్డి ఖండించకపోవడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. మొన్నటి వరకు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం వైసిపిలో అంతర్గత పోరు సాగుతోంది. ఆదిరెడ్డి కూడా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేరు కూడా జిల్లా అధ్యక్ష రేసులో గట్టిగా వినిపిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి, రాజమండ్రి నగర ఇన్‌ఛార్జి పదవుల విషయమై సోమవారం కాకినాడలో జరిగే పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో తేల్చుకోవాలని ఆదిరెడ్డి వర్గీయులు నిర్ణయించారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు హాజరవుతారు. ఆదిరెడ్డి గతంలో టిడిపి రాజమండ్రి నగర అధ్యక్షుడిగా వ్యవహరించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్లతో పొసగకపోవడంతో ఆదిరెడ్డి పార్టీని వీడి వైసిపిలో చేరారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ సహకారంతో ఎమ్మెల్సీ పదవిని పొందారు. ఆనాటి నుంచి వైసిపిలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి.
ఆదిరెడ్డి తన కోటరీని ఏర్పాటు చేసుకోగా, జక్కంపూడి విజయలక్ష్మి ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారు. దివంగత మాజీ కేంద్రమంత్రి కె ఎర్రంనాయుడు వియ్యంకుడైన ఆదిరెడ్డికి టిడిపితో బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎర్రంనాయుడి సోదరుడు ఎపి కార్మికశాఖ మంత్రి కె అచ్చెంనాయుడు వైపు నుంచి టిడిపిలోకి రావాలన్న ఒత్తిడి వస్తున్నట్లు తెలిసింది.