బిజినెస్

భారత ఆర్థిక రంగానికి తిరుగులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: డాలర్ బలపడడం, చమురు ధరలు, వచ్చే ఏడాది జరిగే ఎన్నికలు రూపాయి విలువ, దిశ, దశను నిర్దేశించనున్నాయని ఆర్థిక వేత్తలు భావిస్తున్నారు. వచ్చే ఆరు నుంచి 12 నెలలు కూడా దేశ ఆర్థిక రంగం బాగా ఉంటుందని, ఊపులో ఉండే అవకాశం ఉందని స్టాండర్డ్ చార్టర్డ్ నివేదికలో పేర్కొంది. భారత కరెన్సీ రూపాయి కళకళలాడుతుందంటున్నారు. వృద్ధిరేటు, విదేశీ మారకద్రవ్య నిల్వలు 394 బిలియన్ డాలర్లకు చేరడం వల్ల మంచి సెంటిమెంట్ మార్కెట్లో ఉందని నివేదికలో అంచనా వేశారు. 2010 ఇండియా అవుట్‌లుక్ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. 2019లో కూడా జీడీపీ దూసుకుపోతుందని విశే్లషించారు. భారత ఆర్థిక రంగానికి ఎటువంటి ఢోకాలేదంటున్నారు. అన్నీ మంచి శకునాలేనని, ఆర్థిక రంగం పరుగులుపెడుతుందంటున్నారు. ఆర్థిక సంస్కరణలు వేగవంతమవుతున్నాయి. జీఎస్‌టీ రికార్డు స్థాయి వసూళ్లవుతున్నాయి. దివాలాప్రక్రియ స్మృతిని చక్కగా అమలు చేస్తన్నారు. ఎన్నికల ముందు ఆర్థిక రంగం మెరుగుపడడం మంచి సంకేతమని నివేదికలో పేర్కొన్నారు. వినియోగదారుల ధర ద్రవ్యోల్బణం 2019లో నాలుగు శాతంగా నమోదు కావచ్చు. చమురు ధరలు దిద్దుబాటుకులోనై స్థిరంగా ఉండడం సెంటిమెంట్‌ను పండించింది. చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని ముందు భావించారు. భారత స్టాక్ మార్కెట్ నిలకడగా సాగుతుంది. 2018లో కొన్ని ఒడిదుడుకులకు లోనైనా, స్థిరత్వంతో మార్కెట్ కొనసాగుతుందని స్టాండర్డ్ చార్టర్డ్ హెడ్ ఎండీ నితిన్ సింగ్ చెప్పారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, కాని రిస్క్ నుంచి బయటపడుతాయన్నారు. 2019లో డబుల్ డిజిట్ వృద్ధిరేటు నమోదవుతుందన్నారు.