బిజినెస్

హెల్త్‌కేర్‌కు ఉజ్వల భవిత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: అత్యధిక పోటీ ఉన్న మార్కెట్లో కొత్త యేడాదిలో ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగం మరింతగా బలపడే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రంగంపై నియంత్రణను ప్రభుత్వం మరింత కఠినతరం చేసిన దృష్ట్యా చిన్నాచితకా వ్యాపారులు పోటీకి నిలవలేని పరిస్థితులు ఏర్పడవచ్చని అంటున్నారు. ఈ రంగంలో కొత్త సంవత్సరంలోప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు మరింతగా పెరగనున్నాయి. మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఈ రంగంలో నెలల తరబడి గట్టిపోటీని ఎదుర్కొని సుమారు రూ.4వేల కోట్లతో ఫోర్టిస్‌లో 31 శాతాన్ని భాగస్వామి అయింది. మరో 26 శాతాన్ని సైతం కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేకేఆర్ వెన్నుదన్నుగా సాగుతున్న ఆస్పత్రి యాజమాన్య సంస్థ రేడియంట్ లైఫ్‌కేర్ త్వరలో మేక్స్ హెల్త్‌కేర్‌లో అత్యధిక వాటాలను తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇలా ఈ రెండు సంస్ధలూ ఏకమై సుమారు 7,242 కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని విస్తరించవచ్చని అంచనా వేస్తున్నాయి. ‘ఇప్పటికే మేము ఈరంగంలో అనేక విలీనాలు, సమీకరణలు చూశాం. అయితే పెద్ద సంస్థలు ఏకమై హెల్త్‌కేర్‌ను బలోపేతం చేయడం అరుదు’ అని మణిపాల్ హాస్పిటల్ చైర్మన్ హెచ్.సుదర్శన్ భల్లాయ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ టీపీజీ సహకారంతో నడుస్తున్న మణిపాల్ గ్రూప్ సైతం ఫోర్టిస్‌లో భాగస్వామి కావాలని ఆశిస్తోంది. డీమానిటరైజేషన్, జీఎస్టీ, నగదు లావాదేవీలపై నియంత్రణ వంటి అంశాలు చిన్నచిన్న వ్యాపార సంస్థల మనుగడకు విఘాతం కలిగించే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. అయితే భవిష్యత్తులో హెల్త్‌కేర్ రంగంలో హైవాల్యూమ్, లోమార్జిన్ విభాగాలు ప్రభుత్వ చురుకైన పాత్రతో విశ్వవ్యాప్తమయ్యే అవకాలున్నాయని విశే్లషించారు. వ్యిక్తిగత నిర్వహణలోని కొన్ని చిన్నచిన్న సంస్ధలు మూతపడవచ్చన్నారు. కాగా ఫోర్టిస్‌లో భాగస్వాములు కావడానికి ఐదు వ్యాపార సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇందులో మణిపాల్ గ్రూప్, ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్‌హాద్, చైనాకు చెందిన పెట్టుబడిదారు ఫోసున్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ కేకేఆర్ సహకారం ఉన్న రేడియంట్ లైఫ్ ఉన్నాయి. అంతేకాకుండా భారత వాణిజ్య కుటుంబాల కన్సోర్టియం సైతం ఇందుకు ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. ఇందులో హీరో ఎంటర్‌ప్రైజెస్‌కు ముంజాల్స్, దాబర్ సంస్థకు చెందిన బర్మన్స్ భాగస్వాములు. రేడియంట్ లైఫ్, మేక్స్ మధ్య డీల్ కొన్ని వరుస లావాదేవీల అనంతరం కుదురుతుందని, అలాగే రేడియంట్ లైఫ్‌కేర్ ప్రమోటర్ అభయ్ సోయ్ చైర్మన్‌గా కొనసాగనున్న కంబైన్డ్ సంస్థలో కేకేఆర్ మెజారిటీ షేర్ హోల్డర్ కానుంది. ఇలా విలీనమయ్యే ఈ సంస్ధ దేశ వ్యాప్తంగా 16 ఆస్పత్రుల్లో 3,200 బెడ్లను నిర్వహించనుంది.
రానున్న సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు హెల్త్‌కేర్ రంగంలో ఏర్పడే అవకాశాలున్నాయని వోఖార్డిట్ హాస్పిటల్స్ ఎండీ జహాబియా కొరాకివాలా అభిప్రాయపడ్డారు. దీనిద్వారా ఆరోగ్య సంరక్షణ సమీప భవిష్యత్తులోనే విశ్వవ్యాప్తం అవుతుందని అంచనా వేశారు. కాగా మన దేశంలో హెల్‌కేర్ రంగంలో పెట్టుబడులు ఇప్పటికీ తక్కువ స్థాయిలోనే ఉన్నాయని అపోలో ఆస్పత్రి వైస్ చైర్‌పర్సన్ ప్రీతారెడ్డి అన్నారు. హెల్త్‌కేర్ విషయంలో సేవలకు అనుగుణంగా చాలినంతమంత డాక్టర్లు, నర్సులు మనకు లేరని ఆమె అన్నారు. అంతేకాకుండా మారుతున్న రోగాల వ్యాప్తికి అనుగుణంగాప్రాథమిక వైద్యం, నాణ్యతతో కూడిన వైద్య సేవలు కూడా పెరగాల్సివుందన్నారు. అలాగే జీఎస్టీ, వైద్యం, వైద్య పరికరాలపై ధరల నియంత్రణ అంశాలు కూడా హెల్త్‌కేర్ రంగంలో సవాళ్లుగా మారాయన్నారు. వీటిపై ప్రథానంగా చర్చలు జరిపి సానుకూల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కాగా పార్మా రంగంలో సైతం భారత దేశంలో మంచి ప్రగతికి అవకాశం ఉందని, వచ్చే యేడాది ఈ వృద్ధి రెండంకెలకు చేరవచ్చని, అలాగే కొత్త ఉత్పత్తులు సైతం అనేకం ఆవిష్కృతం అయ్యే అవకాశం ఉందని గ్లెన్‌మార్క్ పార్మాస్యూటికల్స్ చైర్మన్ కం ఎండీ గ్లెన్ సల్డాన్హా తెలిపారు. అమెరికా జనరిక్ ఔషధాల మార్కెట్ కూడా ధరల పెరుగుదల వల్ల కొంత వత్తిడికి గురయ్యే వీలుందన్నారు.