బిజినెస్

నామమాత్ర పతనంతో ముగిసిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఈ ఏడాది చివరి రోజైన సోమవారం సెనె్సక్స్ నామమాత్ర పతనంతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూలంగానే స్పందించినప్పటికీ, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సమాయత్తమైన మదుపరులు స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలపై అం తగా ఆసక్తి కనబరచలేదు. ఫలితంగా 30 షేర్ బాం బే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) సూచీ 8.39 పాయిం ట్లు లేదా 0.02 శాతం పతనమై, 36,068.33 పా యింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా ని ఫ్టీ 2.65 పాయింట్లు లేదా 0.02 శాతం నష్టపోయి, 10,862.55 పాయింట్లుగా నమోదైంది. కాగా, సోమవారం నాటి ఇన్‌ట్రాడేలో డాలర్‌కు రూపాయి మారకపు విలువ 69.90గా స్థిరపడింది. ఇలావుంటే, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పీఐ) సోమవారం 119.60 కోట్ల రూపాయ ల విలువైన వాటాలను అమ్మడం గమనార్హం. అయితే, దేశీయ మదుపరులు చేసిన లావాదేవీల విలువ 1,199.40 కోట్ల రూపాయలు కావడంతో, సెనె్సక్స్ భారీ పతనం లేకుండా, అత్యంత స్వల్ప నష్టాలతో బయటపడింది.
నీరసించిన ఎలక్ట్రానిక్స్!
సుమారు దశాబ్దకాలం లాభాల బాటలో పరుగులు తీస్తూ, కోట్లకు కోట్ల రూపాయలను ఆర్జించిపెట్టిన ఎలక్ట్రానిక్స్ పరికరాల పరిశ్రమ ఈ ఏడాది ఎవరూ ఊహించని విధంగా నీరసించింది. ఏడాది మొదట్లో వేసుకున్న అంచనాలు, నిర్ధారించుకున్న లక్ష్యా లు తారుమారయ్యాయి. ఎలక్ట్రానిక్స్, కమ్యునికేషన్స్ రం గాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, అమ్మకాల గణనీయంగా తగ్గాయి. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్‌లో అమ్మకాల పత నం స్పష్టంగా కనిపించింది. వాషింగ్ మెషిన్లను మినహాయిస్తే, మిగతా అన్ని రకాలా ఎలక్ట్రానిక్స్ ఉ త్పత్తులకు ఈ ఏడాది డిమాండ్ తగ్గిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త సంవత్సరం ప్రా రంభానికి ముందు కూడా స్టాక్ మార్కెట్‌లో ఎలక్ట్రానిక్స్ కంపెనీల వాటాలకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో, మంగళవారం నుంచి మొదలయ్యే కొత్త ఏడాదిలో పరిస్థితి ఏ విధం గా ఉంటుందోనన్న ఆందోళన నెలకొంది.
ఈ రంగంలోని ఉత్పత్తిదారులు భారీ నష్టాలను ఎదుర్కోకపోయినా, అనుకున్నంత లాభాలను ఆర్జించలేకపోయా రు. కొత్త సంవత్సరం లో డిమాండ్ పెరుగుతుందని, అమ్మకాలు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నారు.