బిజినెస్

జీఎస్టీ వసూళ్లు తగ్గాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెలలో తగ్గాయి. గడచిన యేడాది డిసెంబర్‌లో మొత్తం 94,726 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. గడచిన యేడాది ఇదే కాలంలో రూ.97,637 కోట్లు వసూలైట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా జీఎస్‌టీఆర్-3బి ద్వారా మొత్తం 72.44 లక్షల సేల్స్ రిటర్స్ ఫైళ్లు గత నెలలో దాఖలయ్యాయి. నవంబర్‌లో దాఖలైన 69.6 లక్షల ఫైళ్లకంటే ఇది అధికం. కాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శా ఖ గణాంకాల మేరకు గత నెలలో వసూలైన రూ. 94,726 కోట్లలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్‌టీ) ద్వారా 16,442 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్‌జీఎస్‌టీ) ద్వారా 22,459 కోట్లు, ఇంటిగ్రేటెట్ జీఎస్టీ (ఐజీఎస్‌టీ) ద్వారా రూ.47.936 కోట్ల వంతున వసూలయ్యా యి. అలాగే సెస్ రూపేణా రూ.7,888 కోట్లు వసూలయ్యాయి. ప్రభుత్వ నిరంతర సెటిల్మెంట్లు విభా గం ఐజీఎస్‌టీ ద్వారా రూ.18,409 కోట్లమేర సీజీఎస్‌టీ, 14,793 కోట్లమేర ఎస్‌జీఎస్‌టీని కేంద్ర ప్రభు త్వం చెల్లించింది. అలాగే ఎస్‌జీఎస్‌టీగా రూ. 46.252 కోట్లు చెల్లించినట్టు సంబంధిత మంత్రి త్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడచిన ఏప్రిల్ నుంచి తొమ్మిది నెలల కాలానికి జీఎస్టీ ద్వారా నెలవారీ లక్ష్యం 1.12 కోట్లతో ప్రభుత్వం మొత్తం రూ.8.71 లక్షల కోట్లు ఆర్జించిందని మంత్రి త్వ శాఖ వివరించింది. కాగా 2018-19 బడ్జెట్‌లో మొత్తం రూ. 13.48 లక్షల కోట్ల జీఎస్టీ రూపేణా వసూలు చేయాలని అంచనా వేయడం జరిగిందని తెలిపింది. 2017 జూలై నుంచి మార్చి 2018 వరకు రూ. 89.885 కోట్లు వసూలయ్యాయని తెలిపింది.
కొనసాగనున్న తగ్గుదల
ఇలావుండగా 23 వస్తువులపై జీఎస్టీ పన్ను రేట్లను తగ్గిస్తూ జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త సంవత్సరం ఆరంభం నుంచే జీఎస్టీ వసూళ్లలో తగ్గుదల కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం 28 వస్తువులు మాత్రమే 28 శాతం అత్యున్నత పన్ను స్లాబ్ రేటుకింద మిగిలాయి. పన్ను సవరణతో ప్రతియేటా జీఎస్టీ వసూళ్ల మొత్తంలో రూ. 5,500 కోట్లు తగ్గుతుంది. అంటే ఈ యేడాది జనవరి నుంచి మార్చి వరకు జీఎస్టీ ఆదాయంలో రూ. 1,375 కోట్ల మేర తగ్గుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసిం ది. వచ్చే మూడు నెలల కాలానికి జీఎస్టీ వసూళ్లు తగ్గవచ్చని, అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ చట్టం, దర్యాప్తు కేసులు కూడా పెరుగుతాయని జాతీయ పరోక్ష టాక్స్ లీడర్ పీడబ్ల్యుసీకి చెందిన ప్రతీక్ జైన్ అంచనా వేశారు. ప్రభుత్వం కూడా దాపరికాల్లేని విధానాన్ని జీఎస్టీ విషయంలో వచ్చే యేడాది అనుసరించే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయడ్డారు. కాగా గడచిన యేడాది ఏప్రిల్‌లో రూ.1.03 లక్ష కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగాయి. అలాగే మేలో 94,016 కోట్లు, జూన్‌లో 95,610 కోట్లు, జూలైలో 96,483 కోట్లు, ఆగస్టులో 93,960 కోట్లు, సెప్టెంబర్‌లో 1,00,710 కోట్లు, అక్టోబర్‌లో 97,637 కోట్లు, నవంబర్‌లో 97,637 కోట్ల వంతున జీఎస్టీ వసూళ్లు జరిగినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.