బిజినెస్

3 బ్యాంకుల విలీనానికి కేంద్రం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా విలీనానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీనితో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలోనే మూడో అతి పెద్ద బ్యాంక్‌గా ఆవిర్భవించేందుకు మార్గం సుగమమైంది. ఈ విలీనం తర్వాత, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌కు ఉన్న వ్యాపార లావాదేవీలన్నీ బ్యాంక్ ఆఫ్ బరోడాకు బదిలీ అవుతాయి. ఆస్తులు, అప్పులు, ఇతరత్రా ఖాతాలు కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాతో కలిసిపోతాయి. విలీనంలో భాగంగా, విజయా బ్యాంక్‌కు సంబంధించిన రూ.10 విలువైన ప్రతి 1000 షేర్లకుగాను రూ.2 విలువైన 402 షేర్లను బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేస్తుంది. అదే విధంగా రూ.10 విలువైన ప్రతి 1000 దేనా బ్యాంక్ షేర్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.2 విలువైన 110 షేర్లను అందిస్తుంది.

చిత్రం..కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను పత్రికల వారికి వివరిస్తున్న రవిశంకర్ ప్రసాద్, రాజ్‌నాథ్ సింగ్