బిజినెస్

తగ్గనున్న రొయ్యల ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 9: ఇప్పటి వరకు ముమ్మరంగా జరుగుతున్న భారత రొయ్యల ఎగుమతులు 2019లో సుమా రు 7నుంచి 10 శాతం నెమ్మదించే అవకాశం ఉందని రేటిం గ్ ఏజెన్సీ ఇక్రా నివేదిక హెచ్చస్తోంది. 2013 నుంచి 2017 వరకు వరుసగా నాలుగేళ్లపాటు రొయ్యల ఎగుమతుల్లో గణనీయమైన అభివృద్ధి చోటుచేసుకుంది. గడచిన నాలుగేళ్లలో మనదేశ ఎగుమతులు ప్రతి యేటా సుమారు 17 శాతం పెరిగాయని ఆ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా యూరోపియన్, జపాన్ మార్కెట్లలో డిమాండ్ తగ్గడమే కొత్త యేడాదిలో ఎగుమతుల్లో తగ్గుదలకు దోహదం చేయవచ్చని పేర్కొంది. మరోవైపు చైనా, అమెరికా దేశాల డిమాండ్ కొంతమేర పెరగవచ్చని ఇక్రా అంచనావేసింది. గడచిన యేడాది పది నెలల కాలానికి పరిశీలిస్తే మనదేశ మొత్తం రొయ్యల ఎగుమతుల్లో 11.6 శాతం యూరోపియన్ దేశాలకు, మరో 6.5 శాతం జపాన్‌కు జరిగాయి. 2013 నుంచి 2017 వరకు యూరోపియన్, జపాన్ దేశాల డిమాండ్ స్తబ్ధుగా ఉండేది. ఐతే ఈ కాలంలో సంవత్సరానికి 3.3 శాతం వంతున మనదేశ ఎగుమతులు పెరుగుతూ వచ్చాయి. అలాగే జపాన్ ఎగుమతుల్లో సైతం 4.6 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. మనదేశంలో అవసరమైన రొయ్యల ఉత్పత్తి జరగకపోవడంతోబాటు దేశీయంగా వినియోగం పెరగడం వల్ల చైనా డిమాండ్‌కు అనుగుణంగా ఎగుమతులు జగలేదని జిక్రా వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలను పునర్వ్యవస్థీకరించుకునేందుకు ఇరు దేశాలు ముందుకు వస్తున్నాయని జిక్రా నివేదిక వెల్లడించింది. అంతేకాక యూరోపియన్ దేశాలు, జపాన్‌లకు సైతం భవిష్యత్తుల్లో రొయ్యల ఎగుమతులు పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ప్రస్తుతం రొయ్యల ఉత్పత్తిలోనూ, ఎగుమతుల్లోనూ థాయ్‌ల్యాండ్, వియత్నాం అగ్రస్థానంలో ఉన్నాయని ఇక్రా ఉపాధ్యక్షురాలు, కార్పొరేట్ రంగ రేటింగ్స్ అధిపతి పవిత్రా పొన్నయ్య తెలిపారు. 2018లో పది నెలల గణాంకాలు పరిశీలిస్తే మనదేశ మొత్తం రొయ్యల ఎగుమతుల్లో సుమారు 38 శాతం అమెరికాకు జరిగాయి. ప్రధానంగా థాయ్‌ల్యాండ్‌లో డిమాండ్‌కు అనుగుణంగా రొయ్యల ఉత్పత్తి జరగకపోవడం వల్ల మనదేశ రొయ్యలకు అమెరికాలో డిమాండ్ పెరిగిందని పవిత్రా పొన్నయ్య వివరించారు. 2014 నుంచి 17 వరకు ప్రతియేటా అమెరికాకు మనదేశ రొయ్యల ఎగుమతులు 25.2 శాతం వంతున పెరిగాయి.