ఆంధ్రప్రదేశ్‌

మత్స్యకారులకు పరిహారం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 4: సముద్రంలో వేట నిషేధ సమయంలో తీరప్రాంతంలోని మత్స్యకారులకు అందించే పరిహారం పెంచడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పరిహారాన్ని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మొత్తం 6 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో దాదాపు 60 వేల మంది మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పరిహారం లభించనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది.
గతంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పరిహారం కింద రూ.2వేలు చెల్లించేవారు. నేడు దాన్ని రూ.4వేలకు పెంచారు. ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో 1600 మరపడవలు, పది వేల ఇంజిన్ బోట్లు ఉన్నాయి. ఇంజిన్‌బోటుకు ఆరుగురు, మరపడవకు 8 మంది చొప్పున మత్స్యకారులకు పరిహారం అందజేయనున్నారు. ఈ విధంగా దాదాపు రూ.24 కోట్ల పరిహారం అందనుంది.
అయితే తెప్పలపై వేట సాగించే వారికి ఎలాంటి నిషేధం వర్తించదు. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం ఇచ్చే అవకాశం ఉండదని మత్స్యశాఖ జెడి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. సాధారణంగా వేసవిలో చేపలు గుడ్లు పెట్టే సమయం కావడంతో ఆ సమయంలో వేట కొనసాగిస్తే మత్స్యసంపద కోల్పోతామని భావించి ప్రభుత్వం వేట నిషేధాన్ని అమలు చేస్తొంది. విదేశాలకు రొయ్యలు, ట్యూనా చేపలను ఎగుమతి చేయడం వల్ల ఆదాయం లభిస్తోంది. ఇక్కడ నుంచి జపాన్‌కు రొయ్యలు, ట్యూనాచేపలను ఎగుమతి చేస్తున్నారు. ఖరీదైన చేపలు వృద్ధి చెందడానికి ఇది మంచి సమయం కావడంతో చేపల వేట నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మరోపక్క మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు అందజేస్తోంది.
అయితే కొద్దిమంది మాత్రమే వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంజన్లు, వలలు కొనుగోలు చేసే వారికి 50 శాతం సబ్సిడీ లభిస్తోంది. అలాగే ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద బోట్లు కొనుగోలు చేసుకునేందుకు 70 శాతం సబ్సిడీ అందజేస్తున్నారు. దీంతోపాటు భద్రత పరికరాలు కొనుగోలు చేసే వాటికి 75 శాతం సబ్సిడీ అందజేస్తున్నామని జెడి కోటేశ్వరరావు తెలిపారు.