ఆంధ్రప్రదేశ్‌

రంగా విగ్రహ ధ్వంసంపై సర్కార్ సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 4: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహం ధ్వంసంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రెండు రోజుల క్రితం రంగా విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పోలీసు ఉన్నతాధికారులు సోమవారం మచిలీపట్నం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని చినరాజప్ప హెచ్చరించారు. కాపు సోదరులంతా సయమనం పాటించాలని, దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. విశాఖ రీజియన్ ఐజి కుమార్ విశ్వజిత్, ఏలూరు రేంజ్ డిఐజి పి హరికుమార్ ఉదయం నుండి సాయంత్రం వరకు బందరులో మకాం వేసి ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జి విజయ కుమార్, ఇతర పోలీసు అధికారులతో సమీక్షించారు. సాయంత్రం 6గంటల సమయంలో అదనపు డిజిపి ఆర్‌పి ఠాగూర్ మచిలీపట్నం చేరుకున్నారు. తొలుత విశాఖ రీజియన్ ఐజి, ఏలూరు రేంజ్ డిఐజి, జిల్లా ఎస్పీతో ప్రత్యేకంగా సమావేశమై పట్టణంలో నెలకొన్న పరిస్థితులపై ఆరాతీశారు. ఎస్పీ విజయ కుమార్ పట్టణంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతమైన నిజాంపేట వెళ్లి అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు. ఇదిలావుండగా రెండోరోజైన సోమవారం కూడా నిరసనలు వెల్లువెత్తాయి. పట్టణంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా రంగా అభిమానులు ఆయా ప్రాంతాల్లోని రంగా విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు.