ఆంధ్రప్రదేశ్‌

జూన్ లోగా పోలింగ్‌స్టేషన్ల జాబితా నమోదు చేయండి: భన్వర్‌లాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 4: ఓటర్ల జాబితా క్షేత్రసాయి పరిశీలన కోసం పోలింగ్ స్టేషన్ల జాబితా, నమోదు కార్యక్రమాన్ని జూన్ మాసంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ సెనెట్‌హాల్లో సోమవారం కడప, కర్నూలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలకు చెందిన వివిధ కార్పొరేషన్ ఎన్నికల అధికారులతోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లతో ఇంటిన్సిప్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్-2016 కార్యచరణ ప్రణాళికపై సమీక్షించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి అధికారి ఇంటింటికి సర్వేకి వెళ్ళినప్పుడు ఓటరుజాబితాకు సంబంధించిన ప్రతి ఒక అంశాన్ని ట్యాబ్‌లు ద్వారా ఆపరేట్ చేయాలన్నారు సర్వేకి వెళ్ళినప్పుడు ఇంటికి సంబంధంలేని ఓటర్లు ఎవరైనా ఉంటే అప్పటికప్పుడు వారి ఓటును తాత్కాలికంగా తొలగించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈకార్యక్రమం నజారీ నక్ష వైబ్ ఆఫ్ కార్యక్రమం ప్రాంతీయస్థాయి సమావేశం తిరుపతిలో నిర్వహించామన్నారు. నగరపాలక పట్టణాల్లో ఓటరు జాబితా ప్రచురణ కార్యక్రమం వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు సంబంధించి సరిహదులు గుర్తించడం, ప్రతి ఇంటికి నెంబర్లు వేయడం వంటి అంశాలను ట్యాబ్‌ల్లో పొందుపరచాలని స్పష్టం చేశారు.