తెలంగాణ

ఎన్నికల నిర్వహణపై సంపూర్ణ అవగాహన ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, జనవరి 12: రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పంచాయతి ఎన్నికల నిర్వహణపై నిర్వాహకులకు సంపూర్ణ అవగాహన ఉండి తీరాలని, లేకుంటే సమస్యలు తలెత్తగలవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలలో పోలింగ్ అధికారులు ప్రముఖ పాత్ర వహించాల్సి ఉంటుందని, చట్టం, కార్యవిధానం, ఎన్నికల సంఘం సూచనలు, సందేశాలు, ఆదేశాలు పాటించాలని వివరించారు. తాజావిధానాలపై, నియమాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్సులను తెరవడం, మూయడం, సీలింగ్ వేయడం, లెక్కింపు, చెల్లని, చెల్లిన ఓట్లపై శ్రద్ధ వహించి, పోటీదారుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం పాత్రికేయులతో నాగిరెడ్డి మాట్లాడుతూ, సెలవుదినమైనా పోలింగ్‌కై నియుక్తులైన అధికారులు మొత్తం హాజరయ్యారని, శిక్షణార్థులలో సగానికి పైగా గతంలో బ్యాలెట్ విధానంపై అవగాహన ఉన్నవారేనని, ఎన్నికలు విజయవంతంగా నిర్వహించగలరనే సంపూర్ణ విశ్వాసం తమకు కలిగిందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ, ఇప్పటికి రిటర్నింగ్ అధికారులు శిక్షణలు పూర్తి చేసుకుని, విధులు నిర్వహిస్తున్నారని, పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇప్పించడం జరుగుతున్నదని, ఎమ్మెల్యే ఎన్నికలలో పనిచేసిన అనుభవం ఉన్నా, ఈసారి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు ఉంటాయని వివరించారు. తర్వాత లెక్కింపుపై మరో విడత శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఎస్పీ సింధు శర్మ, ఆర్డీఓ నరేందర్, డీపీఓ లక్ష్మీనారాయణ, డీఎస్పీ వెంకటరమణ, తహశీల్‌దార్ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓలు సంధ్యారాణి, నవీన్, మదన్‌మోహన్, సిఐ లక్ష్మీబాబు, ఈఓ పీఆర్‌డీ శ్రీ్ధర్, డిటి సుమన్, ఎస్‌ఐ శ్రీకాంత్, శిక్షణార్థులు పాల్గొన్నారు.
చిత్రం..పోలింగ్ అధికారుల శిక్షణా శిబిరంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి