బిజినెస్

110 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, జనవరి 27: ఒడిశాలోని పారదీప్ ఓడరేవునుంచి ఈ యేడాది 110 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా చేయాలన్న లక్ష్యం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఓడరేవు నుంచి 102 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగింది. దీన్ని మరో 11.56 శాతం పెంచాలన్న లక్ష్యం ఉందని రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా జరిగిన సభలో మాట్లాడుతూ పారదీప్ పోర్టు ట్రస్ట్ చైర్మన్ రింకేష్ రాయ్ తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా వంద మిలియన్ మెట్రిక్ టన్నులను రవాణాను అధిగమించి అలాంటి ప్రధాన ఓడరేవుల క్లబ్‌లో చేరినట్టు ఆయన వివరించారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఇది రెండవ అతిపెద్ద రికార్డు అని, భారత్‌లోని ఓడరేవుల రవాణాలో ఇదే అత్యధిక సరుకు రవాణా రికార్డు అని ఆయన తెలిపారు. ఈ ఓడరేవు సామర్థ్యం 277 మిలియన్ మెట్రిక్ టన్నులుగా రేటింగ్ ఉందని, ఇదే అతివిశాలమైన ఓడరేవు అని ఆయన చెప్పారు. సరికొత్త విధానాల రూపకల్పనతోబాటు, నిపుణతను పాదుకొల్పి రవాణాలో సరికొత్త ప్రమాణాలను అందుకున్నామన్నారు. యాంత్రిక బొగ్గు నిర్వహణ ప్లాంట్ (ఎంసీహెచ్‌పీ)లో సైతం పనితీరులో 65 శాతం అధికంగా నిపుణత సాధించిందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా 1.32 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు కేవలం ఒక్క రోజులో లోడింగ్ జరుగుతుందన్నారు. 2014-15లో ఈ లోడింగ్ 1.01 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉండేదన్నారు. అలాగే ఇనుప ఖనిజ నిర్వహణ ప్లాంట్ సైతం 141 శాతం అధికంగా లోడింగ్ సమర్థతను పెంచుకుందన్నారు. 2014-15లో గంటకు 414 టన్నుల లోడింగ్ జరిగే ఈ ప్లాంటు ప్రస్తుతం గంటకు వెయ్యి టన్నులు లోడింగ్ జరిగే స్థాయికి పెరిగిందన్నారు. సముద్ర ఖనిజ విభాగం సైతం 27 శాతం అధిక సామర్ధ్యాంతో పనిచేస్తోందన్నారు. గత యేడాది (2018) అక్టోబర్‌లో రికార్డు స్థాయి నెలవారీ సరుకు రవాణా 1018 మిలియన్ మెట్రిక్ టన్నులు జరిగిందని చైర్మన్ రాయ్ తెలిపారు.