బిజినెస్

లక్ష్యానికి చేరువగా పత్తి ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: దేశంలో పత్తి ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించే దిశ గా వెళుతున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 355 లక్షల బేళ్లను ఉ త్పత్తి చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. ఒకొక్కటీ 170 కిలోలతో బేళ్లను సిద్ధం చేస్తారు. ఈ ఆర్థిక సం వత్సరానికి ఎంచుకున్న లక్ష్యంలో ఇప్పటికే 324.83 లక్షల బేళ్ల ఉత్పత్తి జరిగినట్టు ప్రాథమిక అంచనా నివేదిక స్పష్టం చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో 348.88 బేళ్లు ఉత్పత్తి జరిగింది. ఈసారి మెరుగైన ఫలితాలను రాబట్టే ప్రయత్నం సఫలమవుతుందని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరా న్ని మినహాయిస్తే (300.05 లక్షల బేళ్లు) మిగతా 2012-13 ఆర్థి క సంవత్సరం నుంచి గత ఆర్థిక సం వత్సరం వరకూ ఉత్ప త్తి నిలకడగా కొనసాగుతున్నది. 2012-13 లో 342.20 లక్షల బేళ్లు ఉత్పత్తికాగా, 2013-14 లో 359.02 లక్షల బేళ్లకు పెరిగింది. 2014-15లో 348.05 లక్ష ల బేళ్ల ఉత్పత్తి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఉత్ప త్తి దాదాపుగా 2014-15 ఆర్థిక సంవత్సర ఫలితానికి దగ్గర్లో ఉండగా, ఈసారి లక్ష్యాన్ని మించే అవకాశముంది.