బిజినెస్

త్రైమాసిక ఫలితాలతో స్టాక్ మార్కెట్‌కు ఊపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), ఇన్ఫోసిస్ వంటి బడా సంస్థలు ఇప్పటికే త్రైమాసిక ఫలితాలను ప్రకటించగా, భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల మరికొన్ని కంపెనీల ప్రకటనలతో స్టాక్ మార్కెట్‌కు మరింత ఊపు ఖాయమని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితి కూడా ఆ వాదనకు బలాన్నిస్తోంది. మూడో త్రైమాసికంలో 10,000 కోట్ల రూపాయలకు మించిన ఆదాయాన్ని రిల్ ప్రకటించిన వెంటనే ఆ కంపెనీ షేర్లకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇన్ఫోసిస్ త్రైమాసిక ఫలితాలను వెల్లడిస్తూనే, మరోవైపు సుమారు 8,200 కోట్ల రూపాయల విలువైన తమ ఈక్విటీ షేర్లను తిరిగి కొంటున్నది. ఈ నిర్ణయం కూడా బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)పై ప్రభావం చూపింది. అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ఇంకా తెరపడపోవడం, ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం అనుకున్న సమయానికి జరగకపోవడం వంటి అంశాలు సహజంగానే అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీనికితోడు ముడి చమురు ధర పెరుగుదల, రూపాయి మారకం విలువ నిలకడగా లేకపోవడం తదితర అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సమయంలో వివిధ కంపెనీలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలే మార్కెట్‌ను ఆదుకుంటున్నాయి.
లార్జ్ క్యాప్‌లోనేగాక, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు కూడా భారత స్టాక్ మార్కెట్ లావాదేవీలను ప్రభావితం చేస్తాయని గతంలో ఎన్నో సందర్భాల్లో రుజువైంది. బులియన్ మార్కెట్ సైతం తనదైన ప్రభావం చూపుతున్నది. 10 గ్రాముల బంగారం ధరలో వరుగా రెండు రోజులు ఏమాత్రం మార్పు లేకపోకుండా, 33,210 రూపాయల వద్ద ముగిసింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్ బలహీన పడడం, దేశీయ మదుపరుల నుంచి డిమాండ్ లేకపోవడం వంటి అంశాలు బంగారం ధర పెరకపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్పాలి. కాగా, కిలో వెండి ధర 210 రూపాయలు తగ్గింది. మార్కెట్‌లో లావాదేవీలు ముగిసే సమయానికి 39,950 రూపాయలుగా నమోదైంది. గత శనివారం గణతంత్ర దినోత్సవం కావడంతో బులియన్ మార్కెట్ మూతపడింది. అంతకు ముందు రోజు, శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 90 రూపాయలు పెరిగి, 33,300 రూపాయల వద్ద ముగిసింది. ఇది మార్కెట్‌కు ఊరటేగానీ ఆశించిన స్థాయిలో నమోదైన ధర కాదు. నిజానికి బంగారం ధర బాగా పెరుగుతుందని, స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చితి బులియన్ మార్కెట్‌కు కలిసి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, లావాదేవీలు అందుకు భిన్నంగా జరిగాయి. కాగా, సహజంగా స్టాక్ మార్కెట్ నీరసించినప్పుడు బులియన్ మార్కెట్ లాభాలను ఆర్జిస్తుంది. స్టాక్ మార్కెట్‌లో బుల్ రన్ కొనసాగితే, బులియన్ మార్కెట్‌కు నష్టాలు తప్పవు. మదుపరులు, బ్రోకర్లు ఎక్కువగా వాటాల అమ్మకాలు, కొనుగోళ్లపై దృష్టి పెడతారు. స్టాక్ మార్కెట్‌లో బుల్న్‌క్రు బ్రేక్ పడి, బేర్ ఆధిపత్యం కొనసాగుతుంటే, వారి దృష్టి బంగారంపై పడుతుంది. రాబోయే రోజుల్లో త్రైమాసిక ఫలితాలతోపాటు బంగారం ధర కూడా స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. మొత్తానికి స్థూలంగా చూస్తే, బులియన్ మార్కెట్ కంటే, త్రైమాసిక ఫలితాలే రాబోయే వారంలోనేగాక, రాబోయే కాలంలోనూ స్టాట్ మార్కెట్‌ను శాసిస్తాయన్నది స్పష్టమవుతున్నది.