బిజినెస్

మార్కెట్‌లోకి బెలనో కొత్త వర్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: మారుతీ సుజుకీ ఇండియా సోమవారం తన ప్రముఖ బ్రాండ్ కారు బెలనో కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర 5.40 నుంచి 8.77 లక్షల మధ్య ఉంటుంది. ఈ కొత్త వెర్షన్‌లో స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్‌ను బిగించారు. ఈ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయని, టైర్లు, పిస్టన్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినట్టు మారుతీ సుజుకీ ఒక ప్రకటనలో తెలిపింది. కారు వెనుకవైపు పార్కింగ్ కెమెరా ఉంటుందని పేర్కొంది. అదే విధంగా ట్రాఫిక్, వాహనాల రద్దీపై నావిగేషన్ సదుపాయం ఉంటుందని వివరించింది. భారత్‌లో కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని బెలనోకు మంచి ఆదరణ లభించిందని మారుతీ సుజుకి తన ప్రకటనలో తెలిపింది. కొత్త వర్షన్‌కు కూడా అదే తరహాలో డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
డిస్కవరీ స్పోర్ట్స్ కారు ఖరీదు రూ.53.77 లక్షలు
కొత్త డిస్కవరీ స్పోర్ట్స్ లాండ్‌మార్క్ ఎడిషన్‌ను జెఎల్‌ఆర్ సోమవారం విడుదల చేసింది. దీని ఖరీదు 53.77 లక్షల రూపాయలు. టాటా మోటర్స్ యాజమాన్యంలోని జాగ్వర్ లాండ్ రోవర్ ఈ కొత్త మోటర్‌ను అందుబాటులోకి తెచ్చింది.