బిజినెస్

‘ఎలక్షన్’ నిర్ణయాలతో మూలధన లోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు భవిష్యత్తులో ద్రవ్యలోటుకు కారణమవుతున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే, ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మరోవైపు కాంగ్రెస్ అన్నివిధాల పుంజుకుంది. తాజాగా ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం లెక్కకు మించిన హామీలు ఇవ్వడం, కొన్నింటి అమలు చేయడానికి ప్రయత్నించడం సాధారణం. అయితే, కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తీసుకునే విధాయక నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. గత బడ్జెట్‌లో ద్రవ్యలోటు 3.3 శాతం ఉండవచ్చునని అంచనా వేశారు. అయితే, ఇది మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. రైతులు, చిన్నతరహా పరిశ్రమలు, తక్కువ ఆదాయం గల కుటుంబాలకు బాసటగా నిలుస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చాలా రకాలైన హామీలను గుప్పించారు. అదేవిధంగా కొన్ని నిర్ణయాలను అమలు చేయడానికి ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో అధిక శాతం రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేసినవే అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిరర్ధక రంగాలకు కూడా ఎన్నికల సమయాల్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుందనేది వాస్తవం. రైతులు, చిన్న, మధ్య తరహా ప్రజలు, పరిశ్రమలకు ఊరట కలిగించే రీతిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజాగా నిర్ణయాలు అమల్లోకి వస్తే 2019-20లో ఉన్న ద్రవ్యలోటు 3.1 శాతం నుంచి 2020-21 నాటికి 3.0 శాతానికి పడిపోయే ప్రమాదం లేకపోలేదని మూడీ ఇనె్వస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో పేర్కొంది. స్వల్పకాలిక ఉపశమనాలతో ఆదాయంపై ప్రభావమేమీ చూపబోదని, శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చే పథకాలు, పరిశ్రమలకు ఆర్థిక సహాయం సమకూర్చడం వల్ల ప్రభుత్వానికి మేలు జరుగుతుందని ఆ సంస్థ అభిప్రాయపడింది. గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం 20 కంటే ఎక్కువ గల వస్తువులపై జీఎస్టీని మరింత తగ్గించింది. ఈ నిర్ణయంతో వ్యక్తిగత పన్నులు, కార్పొరేట్ పన్నులు ద్వారా మరింత ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వాటాల విక్రయం సమంజసం కాదని ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లభించక ఆర్థికంగా సతమతమవుతున్న రైతుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఉదార నిర్ణయాలు ఎంతో మేలు చేకూరుస్తాయని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ అభిప్రాయపడింది. వ్యవసాయ రుణం, పంటలకు ఇన్సూరెన్స్ వంటివాటిని జీరో శాతం వడ్డీతో అందజేయడం వల్ల రైతుల ఆర్థిక పరిపుష్టికి మేలు చేకూర్చినట్టు అవుతుందని ఆ ఏజన్సీ అభిప్రాయపడింది.
మధ్యంతర బడ్జెట్ కీలకం
త్వరలో జరుగబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైనదిగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా అమెరికాకు చికిత్స నిమిత్తమై వెళ్లిన నేపథ్యంలో పీయూష్ గోయల్ ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గతంలోనూ జైట్లీ అనారోగ్యానికి గురైనపుడు ఆర్థిక శాఖ బాధ్యతలను గోయల్ సమర్ధంగా నిర్వహించారు. ఈ కారణంతోనే ప్రధాని మోదీ ఆయనకు మరోసారి ఆ బాధ్యతలను అప్పగించారు. ఈనెల 31 నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలుకావచ్చు. బహుశా వచ్చే నెల 3వ తేదీన గోయల్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టవచ్చునని అంటున్నారు. పార్లమెంటు ఎప్పుడు సమావేశమైనా గోయల్ ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది.