బిజినెస్

హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు ‘ఎలియన్స్’ సర్వీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 28: హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు సరికొత్త సర్వీసును ప్రారంభిస్తున్నట్టు దేశీయ విమానయాన రంగంలో కీలకమైన ఎయిర్ ఇండియాలోని ప్రధాన విభాగం ఎలియన్స్ ఎయిర్ ప్రకటించింది. ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ విమానం హైదరాబాద్‌లో బయలుదేరి, నాసిక్ మీదుగా అహ్మదాబాద్‌కు వెళుతుంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన దేశవాళీ విమాన సర్వీసుల అనుసంధానం ‘ఉడాన్’లో భాగంగా ఎలియన్స్ ఈ నిర్ణయం తీసుకుంది. గంటలోపు ప్రయాణానికి వికెట్ ధర 2,500 రూపాయలకు మించకూడదని ‘ఉడాన్’ ప్రణాళికలో కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ పౌరుడికి కూడా విమాన ప్రయాణ కలను సాకారం చేయడమే ‘ఉడాన్’ లక్ష్యం. కాగా, కొత్త సర్వీసు కోసం 70 సీట్లుగల ఏటీఆర్-72 విమానాన్ని ఎలియన్స్ ఎయిర్ కేటాయించింది. హైదరాబాద్ నుంచి నాసిక్ వరకు విమాన సర్వీసులు ప్రతి రోజూ ఉంటాయని ఎలియన్స్ ఎయిర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. నాసిక్ నుంచి అహ్మదాబాద్‌కు విమాన సర్వీసులు ఆదివారం మినహా మిగతా ఆరు రోజులూ అందుబాటులో ఉంటాయని వివరించింది. ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ఉన్న ఈ సంస్థ ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై హబ్స్ నుంచి దేశంలోని 53 నగరాలకు 100 విమానాలను నడిపిస్తున్నది.