బిజినెస్

ఏపీ మణిహారం.. కియా మోటార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : విభజన తరువాత తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి శ్రమకు ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ను రాష్ట్రానికి రప్పించడంలో ముఖ్యమంత్రి కృతకృత్యులయ్యారు. అనంతపురం జిల్లాల్లో రాష్ట్రానికే మణిహారంగా కియా మోటార్సు వెలుగొందనుంది. ఈ పరిశ్రమ తమ మొదటి ఉత్పత్తిని లాంఛనంగా పూర్తి చేసింది. మూడు మోడళ్లలో కార్లు తయారైనట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కియా నుంచి తయారైన మొదటి కారును ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభించనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గట్టిపోటీ ఎదురైనా, రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ కారణంగా కియా వచ్చింది. 535 ఎకరాల్లో ఏర్పాటైన ఈ యూనిట్‌లో విడిభాగాలు, ఇతర భాగాల తయారీ సహా అసెంబ్లింగ్ కూడా ఇక్కడే చేయడం విశేషం. మేడ్ ఇన్ ఏపీ కారుగా మార్కెట్లోకి వస్తున్న ఈ కారు తన విడిభాగాల తయారీ కోసం 250 ఎకరాల్లో 40 అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మొదటి స్థానంలో ఉన్న ఏపీ, పారిశ్రామిక పెట్టుబడులకు అనువైన విధానాలను తీసుకువచ్చింది. ఒక్కో పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక పాలసీలను సైతం ప్రవేశపెట్టింది. మరింతమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేలా సింగిల్ డెస్క్ విధానం చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్‌ను రూ.14,200 కోట్లతో
ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో 4000 మందికి ప్రత్యక్షంగా, 7 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రెండో దశ పూర్తి అయితే మరో 10 వేల ఉద్యోగాలు రానున్నాయి. యూనిట్‌లో పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభమైతే సంవత్సరానికి నాలుగు లక్షల కార్లను ఉత్పత్తి చేస్తుంది. డిమాండ్‌ను అనుసరించి, అవసరమైతే విదేశాలకు కూడా ఎగుమతి చేసేందుకు కంపెనీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.