బిజినెస్

నీరవ్ మోదీ భవనంలో అతి విలాసవంతమైన వస్తువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 29: విదేశాల్లో తలదాచుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్ మోదీకి చెందిన పోష్ బంగ్లా కూల్చివేత పనులు రెండు రోజుల విరామానంతరం మంగళవారం మళ్లీ ఆరంభమయ్యాయి. అంతకు ముందు ఈ భవనం కూల్చివేత చేపట్టిన సందర్భంగా అతి విలాసవంతమైన ఫిట్టింగ్‌లు ఉన్నట్టు కనుగొన్న అధికారులు కూల్చివేత పనులను రెండు రోజులపాటు ఆపివేయడం జరిగింది. కాగా అనుమతి లేని నిర్మాణాల తొలగింపులో అలసత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మహారాష్టల్రోని రాయ్‌గడ్ జిల్లాలోని నీరవ్‌మోదీ పోష్ బంగ్లాతోబాటు మొత్తం 58 అనుమతి లేని నిర్మాణాలను కూల్చి వేయాలని రాయ్‌గడ్ జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశీ గతనెలలో ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్మాణాలన్నీ ముంబయికి 90 కిలోమీటర్ల దూరంలోని అలీబాగ్ బీచ్ సమీపంలో కిహిమ్ వద్ద ఉన్నాయి. కాగా నీరవ్ మోదీ పోష్ బంగ్లాలో అమర్చిన విలువైన వస్తువులేవీ పాడవకుండా జాగ్రత్తగా స్వాధీనం చేసుకోవడం ద్వారా వీలైనంత ఎక్కువ మొత్తంలో రికవరీ జరిగేలా చూడాలని అధికారులు నిర్ణయించారు. దీంతో గత 27వ తేదీ నుంచి ఈ బంగ్లా కూల్చివేత పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సివిల్ ఇంజినీరింగ్ శాఖలోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా విలువైన వస్తువులు, నిర్మాణాలను స్వాధీనం చేసుకునేలా ఈ భవనాన్ని ఎలా కూల్చాలన్న విషయంపై చర్చించేందుకు కొంత సమయం తీసుకున్నామని, ఇక మళ్లీ కూల్చివేత పనులు ఆరంభిస్తామని జిల్లా రాయ్‌గడ్ జిల్లా అధికారులు తెలిపారు. వాస్తవానికి బీచ్ సమీపంలో తక్కువ ఆటుపోట్లు, ఎక్కువ ఆటుపోట్లు గల ప్రాంతాల్లో నిర్మించివున్న నీరవ్ మోదీ పోష్ బంగ్లా, ఇతర ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే అటాచ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడి నిర్మాణాలను కూల్చివేసే ముందు ఈ కేసులో వీలైనంత ఎక్కువ మొత్తంలో పరిహారం అందేలా విలువైన వస్తువులన్నీ జాగ్రత్తగా సేకరించాలని ఈడీతోబాటు, రాయ్‌గడ్ జిల్లా అధికారులు నిర్ణయించారు. అయతే ఇప్పుడు ఈ నిర్మాణాల్లో భాగంగా ఉన్న విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన, విలాసవంతమైన ఫిట్టింగ్‌లను, కిటికీ గ్రిల్స్ ఇతర వస్తువులను సమీకరించే పని మొదలైందని కలెక్టర్ సూర్యవంశీ పీటిఐకి చెప్పారు.
కాగా తక్కువ ఆటుపోటు ప్రాంతంలో నిర్మించిన భవనం ఎదుట రెండు అతి విలాసవంతమైన కార్లు కూడా పార్కుచేసి ఉన్నాయని, అలాగే కుషన్లు, గ్లాస్ ఫ్రేమ్‌లు, బర్మాటేక్‌తో తయారైన ఫర్నీచర్, స్వమ్మింగ్ పూల్ ఉన్నాయని రెండేళ్ల కాలంగా వీటిని ఎవరూ వాడడం లేదని అధికారులు తెలిపారు.