బిజినెస్

రియల్ ఎస్టేట్ యజమానులకు స్టాంజా ఎస్టేట్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: రియల్ ఎస్టేట్ యజమానుల కోసం వినూత్నమైన స్టాంజా ఎస్టేట్ యాప్‌ను స్టాంజా లింగ్ విడుదల చేసింది. 2021 నాటికి ఒక లక్ష పడకల సామర్థ్యానికి చేరుకోవడమే లక్షంగా పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రాపర్టీ లిస్టింగ్స్‌కు వనరులను సృష్టించనుంది. ప్రాపర్టీ యజమానులకు అధిక రాబడులను ఆఫర్ చేస్తుంది. స్టూడెంట్ లింగ్ అసెట్‌గా రియల్-టైమ్ ప్రాపర్టీ అవకాశాల విశే్లషణకు అవకాశం కల్పిస్తుంది. స్టాంజా లివింగ్‌తో భాగస్వామ్యం కలిగిన స్థిరాస్తుల యజమానులు, బ్రో కర్లు, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్‌లు, డెవలపర్లకు ఈ యాప్ సమర్థవంతమైన విధానంలో, ఆధునిక, అధిక నాణ్యత కలిగిన విద్యార్థుల వసతి సదుపాయాలను కల్పించేందుకు అ వకాశం కల్పిస్తుంది. ఈ సందర్భంగా స్టాంజా లివింగ్ సహ వ్యవస్థాపకులు అనింద్య దత్త, సందీప్ దాల్మియా మాట్లాడుతూ తాము సుస్థిరతతో అభివృద్ధిలో కొనసాగుతున్నామ ని చెప్పారు. 2021 నాటికి లక్ష పడకలకు పైగా సామర్థ్యానికి చేరుకునే లక్ష్యాన్ని కలిగి ఉన్నామని వారు తెలిపారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులకు వసతి సదుపాయాలను క ల్పించే బ్రాండ్‌గా రూపుదిద్దుకోవాలన్న లక్ష్యంతో పాటు దేశంలోని విద్యార్థులకు అధిక నాణ్యత సదుపాయాలు ఉ న్న నివాస సదుపాయాల అనుభవాన్ని కల్పించే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్లు వివరించారు. సూక్ష్మతలతో కూడిన ఇంటర్‌ఫేస్, తేలికైన నేవిగేష్‌తో వినియోగదారులు స్థిరాస్తుల వివరాలను సమగ్రతతో నమోదు చేసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ప్రాపర్టీకి విలువ లెక్కింపు, షార్ట్ లిస్టింగ్, ఎంపికలకు సంబంధించిన రియల్-టైమ్ అప్‌డేట్లు చేసుకోవచ్చని వారు చెప్పారు.