బిజినెస్

మళ్లీ పెరిగిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు బుధవారం కూడా పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి, రూ. 34,000 మార్కును దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్‌లోనూ వాటి ధరలు పెరిగాయని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. పది గ్రాముల పసిడి ధర రూ. 320 పెరిగి, రూ. 34,070కి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి ధర కూడా కిలో గ్రాముకు రూ. 330 పెరిగి, రూ. 41,330కి చేరుకుంది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాం డ్ పెరగడంతో వెండి ధర పెరిగింది. ప్రపంచ మార్కెట్‌ను పరిశీలిస్తే న్యూయార్క్‌లో ఒక ఔన్స్ బంగారం ధర 1,314.76 డాలర్లకు పెరిగింది. అలాగే ఒక ఔన్స్ వెండి ధర 15.96 డాలర్లు పెరిగింది.