బిజినెస్

చేనేత రంగానికి చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 30: బ్రాండెడ్ దుస్తుల కంపెనీ అరవింద్ ఫ్యాషన్స్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంయుక్త నిర్వహణలోని ‘ట్రూ బ్లూ’ కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. భారత చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యమని కంపెనీ తెలిపింది. ఈమేరకు చేనేత కార్మికులు, కళాకారుల నుంచి ప్రభుత్వ మద్దతుతోట్రూ బ్లూ సంస్ధ నేరుగా ఉత్పత్తులను సేకరిస్తుంది. వాటిని ‘ట్రూబ్లూ హస్త కళా వస్తువులు’గా తమ సంస్థ విక్రయాలు చేస్తుందని, దీన్ని తమ బ్రాండెడ్ విక్రయాల్లో భాగం చేస్తామని ట్రూ బ్లూ అధికారులు తెలిపారు. ఇందుకోసం సరికొత్త మార్కెట్లు, అవెన్యూలు ఏర్పాటు చేసి దేశీయ వినియోగదారులకు అందుబాటులో ఉంచుతామన్నారు. దేశ వ్యాప్తంగా వచ్చే మార్చి నెలలో ట్రూబ్లూ స్టోర్‌లలో ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఆరంభమవుతుందన్నారు. పవర్ లూమ్స్‌తో సంబంధం లేకుండా కేవలం అసలైన చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తామన్నారు. చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని, వీటిని ధరించడం గొప్పతనంగా విదేశీయులు భావిస్తారని అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా ఏర్పడే కొత్త డిమాండ్‌కు అనుగుణంగా చేనేత కార్మికులు దేశంలోని సామాన్య ప్రజలను సైతం అకట్టుకునేలా సరికొత్త రకమైన ఉత్పతులను ఆవిష్కరించే అవకాశం కలుగుతుందన్నారు. కాగా, నేరుగా ఉత్పత్తులను సేకరించడం ద్వారా నేత కార్మికులకు మరింత గుర్తింపును, వారి ఉత్పత్తులకు మద్ధతు ధరలను, ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు, దళారీల బెడద లేకుండా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పంద ద్వారా కృషి చేస్తోందని టెక్స్‌టైల్స్ మంత్రి స్మృతి ఇరానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రధానంగా తమిళనాడులోని కాంచీవరం, పశ్చిమ బెంగాల్‌లోని బలుచారి, జమ్దానీ, మహారాష్టల్రోని పైతానీ, మధ్య ప్రదేశ్‌లోని చెందేరీ, మహేశ్వరీ, అస్సాంలోని ముగా, గుజరాత్‌లోని పటోలా, కాశ్మీర్‌లోని కని, ఒరిస్సాలోని టై అండ్ డై విచిత్రపురి, బొంకై, వారణాసిలోని బ్రోకేడ్స్, కేరళలోని బల్‌రామ్‌పురం, ఆంధ్రప్రదేశ్‌లోని పోచంపల్లి తదితర ప్రాంతాల నుంచి చేనేత వస్త్రాల సేకరణ జరుగుతుందని ఆమె వివరించింది. దేశ వ్యాప్తంగా 23 లక్షలకు పైగా చేనేత మగ్గాలుండగా, దాదాపు 43 లక్షల మంది చేనేత కార్మికులున్నారని చెప్పారు. చేనేత కార్మికుల్లో నిపుణతను మరింతగా పెంచేందుకు వారికి డిజైనింగ్ పరికరాలు, అత్యుత్తమ ముడిసరుకు తదితరాలు సమకూర్చాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.