బిజినెస్

రాష్ట్రానికి 21 బిలియన్ డాలర్ల్ల పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పారిశ్రామికాభివృద్ధి కోసం చేపడుతున్న అనేక ప్రత్యేక చర్యలలో భాగంగా ఐ-పాస్ ఏర్పాటు చేయడం జరిగిందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. బుధవారం నగరంలో ఏర్పాటైన ‘ ఫిక్కీ’ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 21 బిలియన్ డాలర్లు పెట్టుబడులుగా వచ్చాయని తెలిపారు. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇకి కూడా ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నదని అన్నారు. మేకిన్ తెలంగాణలో భాగంగా ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్ పార్కులను కూడా ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు దరఖాసస్తు చేసిన 8,500 కంపెనీలకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఏ కంపెనీ అయినా తమ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన మానవ వనరులను అందించడానికి ప్రత్యేకంగా టాస్క్‌ను ఏర్పాటు చేశామని, ఈ టాస్క్ ద్వారా యువతకు అవసరమైన నైపుణ్యాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ డాక్టర్ వైవి రెడ్డి, ఫిక్కీ, సీనియర్ వైస్-ప్రెసిడెంట్ సంగీతారెడ్డి, ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిలీపీ చినాయ్, ఫిక్కీ తెలంగాణ కో-చైర్ టీ.మురళీధర్‌న్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఫిక్కీ ప్రతినిధులు హాజరయ్యారు.