బిజినెస్

తగ్గిన పసిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: గత మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు గురువారం బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో జువలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో తులం (పది గ్రాములు) బంగారం ధర గురువారం రూ.70 తగ్గి 34వేలకు చేరింది. అఖిల భారత సరాఫా అసోసియేషన్ గణాంకాల మేరకు వెండి మాత్రం కిలోపై స్వల్పంగా రూ.20 పెరిగి రూ.41,350కి చేరింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి పెరిగిన డిమాండ్‌తో వెండి ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక బంగారానికి దేశీయ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గినా అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌తో ధరలు మరింతగా పడిపోయే ప్రమాదం తప్పిందని విశే్లషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా న్యూయార్క్‌లో ఔన్సు బంగారంపై 1,318,86 డాలర్లు, ఔన్లు వెండిపై 16.02 డాలర్ల వంతున ధరలు పెరిగాయి. గత మూడు రోజులుగా దేశీయ మార్కెట్లలో బంగారం ధర రూ.770 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం రూ.70 తగ్గి 34వేలకు, 99.5 శాతం స్వచ్ఛ బంగారం 33,850కు చేరాయి. అలాగే 8 గ్రాముల సవరం బంగారం ధర మాత్రం నిలకడగా రూ.25,900 పలికింది. కాగా వెండి వార విధానంతో జరిగే వ్యాపారంలో మాత్రం రూ.44 తగ్గి 40,390 పలికింది. అలాగే వెండి నాణేలు ధరలో కూడా మార్పు లేదు.