బిజినెస్

665 పాయింట్లు ఎగబాకిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 31: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలతోబాటు త్వరలో రానున్న కేంద్ర మధ్యంతర బడ్జెట్ దేశీయ మార్కెట్ సెంటిమెంటుకు ఊతమివ్వడంతో బ్యాంకింగ్, ఆటో, పార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ వాటాల కొనుగోళ్లు గురువారం ఊపందుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్ సూచీలు పుంజుకుని మంచి లాభాలను సంతరించుకున్నాయి. 650 పాయింట్లు ఎగబాకిన సెనె్సక్స్ 36,255.69 వద్ద ముగియగా, 179 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 10,830.95 పాయింట్లకు చేరింది. డావిష్ విధాన వైఖరిని అమెరికన్ ఫెడరల్ రిజర్వు చేయడం, ఎఫ్ అండ్ ఓ సానుకూలతలు కూడా భారత మార్కెట్లకు ఊతమిచ్చినట్టు విశే్లషకులు భావిస్తున్నారు. ఐటీ, విద్యుత్, బ్యాంకింగ్ వాటాలతోబాటు బీఎస్‌ఈ రంగ సూచీలన్నీ లాభాలను సంతరించుకోవడం గమనార్హం. అమెరికన్ ఫెడరేషన్ మానిటరీ విధానాన్ని సవరించాలన్న వైఖరిని ప్రస్తుతానికి రిజర్వులో ఉంచడంతో ఇందుకు సంబంధించిన ప్రధాన నిధుల రేటులో ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు. దీంతో ఇప్పట్లో ఆర్థిక రంగానికి వచ్చిన ఇబ్బందులేవీ లేవన్న భరోసా కలగడం అంతర్జాతీయ మార్కెట్లకు సానుకూలంగా మారిందని ఆర్థిక రంగ విశే్లషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఆరునెలలుగా సాగుతున్న చైనా-అమెరికా వాణిజ్య యుద్ధానికి చరమగీతం పలికేందుకు ఇరుదేశాలూ రెండు రోజులుగా సాగిస్తున్న చర్చలు కూడా మార్కెట్లకు సానుకూలంగా మారాయి. ఇక రైతులకు సాగులో ఎదురవుతున్న కష్టాలను తొలగించేందుకు, నిరుద్యోగ సమస్యను నియంత్రించేందుకు, వినిమయ సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టి ఈ అంశాలను త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పొందుపరుస్తోందన్న వార్తలతో మదుపర్లు భారత మార్కెట్లవైపు ఆశక్తిచూపారు. ఈ క్రమంలో ఎఫ్‌పీఐలు (విదేశీ ఇనె్వస్టర్లు రూ.130.25 కోట్ల విలువైన వాటాలను గురువారం కొనుగోలు చేశారు. అలాగే దేశీయ ఇనె్వస్టర్లు (డీఎల్‌ఎల్‌లు) రూ.502 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేశారు.
లాభపడిన సంస్థలివే..
సెనె్సక్స్‌లో ఆక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, టాటాస్టీల్స్, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, ఐటీసీ, సన్‌పార్మా సంస్థల 4.64 శాతం లాభపడ్డాయి. ఐతే మరోవైపు యెస్‌బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా సంస్థలు 2.56 శాతం నష్టపోయాయని బీఎస్‌ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇలావుండగా అంతర్జాతీయ మార్కెట్లలో ఆసియా పరిధిలోని హాంగ్‌కాంగ్‌కు చెందిన హ్యాంగ్‌సెంగ్ 1.08 శాతం లాభపడింది. అలాగే జపాన్‌కు చెందిన నిక్కీ 1.06 శాతం, షాంఘాయ్ కాంపోజిట్ సూచీ 0.35 శాతం, పారిస్‌కు చెందిన సీఏడీ-40 0.42 శాతం, లండన్‌కు చెందిన ఎఫ్‌టీఎస్‌ఈ 0.53 శాతం వంతున ఉదయపు లావాదేవీల్లో లాభాలను సంతరించుకున్నాయి. అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ తగ్గి 71.15కి రూపాయలకు చేరింది. అలాగే ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగి బ్యారెల్ 61.55 డాలర్లు పలికింది.