బిజినెస్

చమురు, సహజ వాయువు ఉత్పత్తుల్లో తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: మన దేశంలో ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తుల్లో తగ్గుదల నమోదుకావడం అటు అధికారులను, ఇటు సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నది. లక్ష్యాలను అందుకోవడంలో విఫలం కావడం, సరికొత్త వ్యూహ రచన అవసరాన్ని స్పష్టం చేస్తున్నది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ముడి చమురు ఉత్పత్తి లక్ష్యాన్ని 27.54 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించగా, 25.84 మెట్రిక్ టన్నులు సాధ్యమైంది. ఉత్పత్తి అంచనాల్లో 5.88 శాతం తగ్గుదల నమోదైంది. గత ఏడాది డిసెంబర్ మాసంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం గమనార్హం. 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంకాగా, 2.86 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితమైంది. అంచనాల్లో తగ్గుదల 10.13 శాతం. అయితే, రిఫైనరీ ఉత్పత్తుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో 19.80 లక్షల మెట్రిక్ టన్నులను లక్ష్యంగా ఉంచగా, 19.26 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. అనుకున్న దానికంటే ఒక శాతం అధికంగా ఉత్పత్తి నమోదైంది. అయితే, డిసెంబర్ మాసాన్ని పరిశీలిస్తే, లక్ష్యం 2.19 లక్షల మెట్రిక్ టన్నులుకాగా, సాధించింది 2.10 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే, 4.32 శాతం తక్కువ ఉత్పత్తి జరిగింది. సహజ వాయువు పరిస్థితి కూడా ముడి చమురు మాదిరిగానే ఆశాజనకంగా లేదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 26.58 లక్షల మెట్రిక్ టన్నులను లక్ష్యంగా ఉంచుకోగా, 24.65 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధ్యమైంది. లక్ష్య సాధనలో లోటు 7.26 శాతం. గత ఏడాది డిసెంబర్‌లో ఉత్పత్తి లక్ష్యం కంటే 4.86 శాతం తక్కువగా ఉంది. 3.13 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం స్థానంలో 2.87 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. ఈ గణాంకాలను పరిశీలించిన తర్వాత, ఈ ఏడాది పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న అనుమానం తలెత్తుతోంది.