బిజినెస్

రెడ్డీ ల్యాబ్స్ త్రైమాసిక లాభాలు రూ.485 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 1: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ శుక్రవారం త్రైమాసిక లాభాలను వెల్లడించింది. పన్నుల చెల్లింపుల అనంతరం దాదాపు 45 శాతం వృద్ధితో గత డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 485 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించినట్టు సంస్థ వెల్లడించింది. గత యేడాది ఇదే కాలంలో రూ.334 కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయని తెలిపింది. అలాగే ఈ త్రైమాసికంలో సంస్థకు రూ.3,850 కోట్ల ఆదాయం వచ్చిందని, గత ఇదే త్రైమాసికంలో రూ.3.806 కోట్ల ఆదాయం వచ్చినట్లు కంపెనీ సీఈఓ, కో చైర్మన్ జీవీ ప్రసాద్ తెలిపారు. భారతీయ మార్కెట్లలో వస్తున్న సానుకూల వైఖరి తోబాటు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలకు ఊతం లభించడం, ధరల విషయంలోప్రోత్సాహం తమ కంపెనీ స్థిరమైన వృద్ధికి, ఆర్థికాభివృద్థికి దోహదం చేశాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ జనరిక్ విభాగాల నుంచి ఈ త్రైమాసికంలో ఆదాయం రూ.3,135 కోట్లు వచ్చిందని, ఇయర్ ఆన్ ఇయర్ పద్ధతిలో ఈ ఆదాయం 4 శాతం వృద్ధి చెందిందని తెలిపారు. అయితే తమ కంపెనీకి ఉత్తర అమెరికా నుంచి వచ్చే ఆదాయంలో మాత్రం 8 శాతం తగ్గిందని గతంలో ఇదే త్రైమాసికంలో రూ.1,607 కోట్ల ఆదాయం రాగా తాజా త్రైమాసికంలో 1,480 కోట్లకు తగ్గిందని ప్రసాద్ వివరించారు. పార్మాస్యూటికల్ సర్వీసెస్, ఆక్టివ్ ఇన్‌గ్రీడియంట్స్ నుంచి రూ.594 కోట్లు వచ్చిందని ఇది గత ఇదే త్రైమాసికంతో పోలిస్తే 9శాతం అధికమని తెలిపారు.